OTT Suggestions - Best Suspense Thriller : వీడియో కాల్స్ లోనే ప్రేమ.. ఆ తర్వాత.. OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్..!

OTT Suggestions: వీడియో కాల్స్ లోనే ప్రేమ.. ఆ తర్వాత.. OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్..!

OTT Suspense Thriller : ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller : ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

ఎంత వేరే భాషలో సినిమాలు చూసినా కానీ ఆ సినిమాలను తెలుగులో చూస్తూనే మంచి కిక్ ఉంటుంది. అదే డైరెక్ట్ తెలుగు మూవీస్ నే చూస్తే ఇంకా ఆ సినిమాలు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాయి. ఇక తెలుగులో కూడా ఇప్పుడు మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకో ఈ సినిమాలు అంతగా పాపులర్ అవ్వవు. ఎప్పుడైనా ఈ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం.. అప్పుడు ఆ సినిమా ఏంటా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందా అనే ఆసక్తి అందరికి కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం. ఈ సినిమాలో విశ్వ అనే అతను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతను అఫ్రేష్ , క్రిస్టి , సదా లతో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక క్రిస్టి ఫ్రెండ్ మిత్రా. ఆమె ఓ రోజు క్రిస్టిని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు.. అప్పటికే క్రిస్టితో వీడియో కాల్ లో ఉన్న విశ్వ.. మిత్ర ను చూసి ఫిదా అయిపోతాడు. దీనితో మెల్లగా వారిద్దరూ వీడియో కాల్స్ ద్వారా ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. .. ఓ రోజు సడెన్ గా క్రిస్టి రూమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆమెను కత్తితో పొడుస్తాడు. దీనితో అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. క్రిస్టి తో పాటు మిత్ర కూడా ప్రమాదంలో పడుతుంది. ఆన్ లైన్ లో ఈ సన్నివేశాలను చూస్తున్న విశ్వ.. మిత్రను ఎలా కాపాడతాడు ! అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ! అసలు ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు ! విశ్వ , అతని ఫ్రెండ్స్ కు ఏదైనా గతం ఉందా !అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటి ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “WWW” . ఈ సినిమాలో కనిపించే పాత్రలు తక్కువే అయినా కానీ.. కథ మాత్రం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో మిత్ర పాత్రలో నటించింది మరెవరో కాదు.. శివాని రాజశేఖర్. శివాని రాజశేఖర్ ఏ సినిమాలో తీసిన కానీ.. తనదైన శైలిలో మంచి పాత్రలను ఎన్నుకొని ఆయా సినిమాలకు పూర్తి న్యాయం చేస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా అలానే నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇది రివెంజ్ డ్రామానా .. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనా.. లవ్ స్టోరీనా ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sonyliv.com/movies/www-telugu-1000151146

Show comments