OTT Suggestions- Telugu Suspense Thriller: OTTలో తెలుగు బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. 'రాగల 24 గంటల్లో' మూవీ చూశారా!

OTTలో తెలుగు బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘రాగల 24 గంటల్లో’ మూవీ చూశారా!

OTT Telugu Suspense Thriller: ప్రస్తుతం సస్పెన్స్ సినిమాలకు క్రేజ్ బాగానే ఉంది. అలాగే ఈ మధ్య కాలం ఓటీటీ లోకి వచ్చే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Telugu Suspense Thriller: ప్రస్తుతం సస్పెన్స్ సినిమాలకు క్రేజ్ బాగానే ఉంది. అలాగే ఈ మధ్య కాలం ఓటీటీ లోకి వచ్చే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

లాంగ్వేజ్ బారియర్ లేకుండా ఓటీటీ లో వచ్చే ప్రతి ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకులు చూస్తున్న మాట నిజమే. అయితే అన్ని సినిమాలను చూస్తున్న కానీ.. వారు ముఖ్యంగా వెయిట్ చేసేది మాత్రం తెలుగు సినిమాల కోసమే. ఎప్పుడెప్పడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయా అని చూస్తూ ఉంటారు. ఇక వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ కు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు . ఇప్పుడైతే తెలుగులో కూడా మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ ను రీలిజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిని ఎలాగూ మిస్ చేసే ఛాన్స్ లేదు. కానీ ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని తెలుగు సినిమాలను మాత్రం మిస్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాహుల్ అనే అతను ఇండియాలోనే నెంబర్ వన్ ఫోటో గ్రాఫర్.. అతను ఒక ఫోటో షూట్ చేస్తే.. ఆ అమ్మాయి కచ్చితంగా టాప్ మోడల్ అవ్వాల్సిందే. అయితే.. ఓ రోజు అతని దగ్గరకు ఓ అమ్మాయి ఫోటో షూట్ కోసం వచ్చినపుడు ఆమెను డ్రెస్ తీసేయమని చాలా సింపుల్ గా చెప్తాడు. దీనితో ఆమెకు కోపం వచ్చి అక్కడి నుంచి పారిపోతుంటే.. ఆమెను చంపేస్తాడు. ఈ క్రమంలో అతను విద్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తరువాత మాత్రం బెడ్ రూమ్ లో కెమెరాలు పెట్టి.. ఆమెకు నరకం చూపిస్తాడు. దీనితో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ రోజు అనుకోని విధంగా రాహుల్ హత్యకు గురవుతాడు. విద్య కోసం తన ఫ్రెండ్ గణేష్ ఈ హత్య చేసి ఉంటాడని.. ఈ నేరాన్ని తన మీద వేసుకుంటుంది విద్య .

కట్ చేస్తే ఆ హత్యను గణేష్ కూడా చేసి ఉండడు.. దీనితో విద్య షాక్ అవుతుంది. మరి ఈ హత్యను చేసింది ఎవరు ? అందరిని చంపే రాహుల్ ను చంపింది ఎవరు ? దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారు ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు “రాగల 24 గంటల్లో”. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ,గణేష్ వెంకట్రామన్ ,ముస్కాన్ సేథీ, కృష్ణ భగవాన్, అదిరే అభి, టెంపర్ వంశీ, రవి ప్రకాష్, రవి వర్మ లాంటి వారు నటించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Show comments