OTT లో వెరైటీ Sci-Fi మూవీ ‘ఇన్ టైమ్’.. అక్కడ డబ్బుతో పనిలేదు!

OTT Best Sci-Fi Movie In Time: సైన్స్ ఫిక్షన్ సినిమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. వీటిలో ఎవరికీ తెలియని గతాన్ని లేదా తెలుసుకోవాల్సిన ఫ్యూచర్ ను చూపిస్తూ ఉంటారు. మరి బ్రతకడానికి డబ్బు కాకుండా.. టైమ్ ను ఉపయోగించే స్టోరీ గురించి చూశారా. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Best Sci-Fi Movie In Time: సైన్స్ ఫిక్షన్ సినిమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. వీటిలో ఎవరికీ తెలియని గతాన్ని లేదా తెలుసుకోవాల్సిన ఫ్యూచర్ ను చూపిస్తూ ఉంటారు. మరి బ్రతకడానికి డబ్బు కాకుండా.. టైమ్ ను ఉపయోగించే స్టోరీ గురించి చూశారా. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో డిఫరెంట్ జోనర్స్ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తున్నాయి. ఇక వీటిలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఈ మధ్య స్పెషల్ క్రేజ్ లభిస్తుంది. ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్తాయి. ఎవరికీ తెలియని గతాన్ని పరిచయం చేస్తూ వచ్చే సినిమాలు కొన్నైతే.. అందరూ తెలుసుకోవాల్సిన ఫ్యూచర్ గురించి వచ్చే కథలు మరికొన్ని. అయితే.. బ్రతకడానికి ఎవరైనా సరే డబ్బు సంపాదించాల్సిందే అలాగే ఖర్చు చేయాల్సిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో మాత్రం డబ్బు ప్లేస్ లో టైమ్ ను ఉపయోగిస్తారు. వినడానికి కొత్తగా ఉన్న ఈ మూవీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ప్రతి వ్యక్తి జెనెటికల్ గా మోడిఫై చేయబడి ఉంటారు. దాని వలన ఎవరు కూడా ఏజ్ అయ్యిపోవడం , రోగాలు వచ్చి చనిపోవడం లాంటివి జరగవు. కాబట్టి ఆ వ్యక్తులు ఫ్యూచర్ లో ఏది కొనాలన్నా సరే.. టైమ్ నే ఉపయోగించాల్సి ఉంటుంది. అక్కడ వ్యక్తులకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతిపైన వన్ ఇయర్ టైమ్ స్పాన్ కనిపిస్తుంది. అంటే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మనిషికి ఇంకా సంవత్సరం మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంటుందని అర్ధం. ఒకవేళ వారు తమ లైఫ్ స్పాన్ ను పెంచుకోవాలంటే మాత్రం.. టైమ్ ను సంపాదించుకోవాలి.

ఈ క్రమంలో విల్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఓ సిటీ లో ఉంటాడు. అక్కడ ఎక్కువ పేదవాళ్ళే ఉంటారు. వారంతా కూడా తమ జీవిత కాలాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వారందరు కూడా టైమ్ ను దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇక విల్లు తల్లి కూడా తనకు సిస్టర్ లా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజు విల్ వాళ్ళ అమ్మ తన దగ్గర కేవలం మూడు రోజులు మాత్రమే ఉందని చెప్తుంది. ఈలోపు నేను ఓవర్ టైమ్ వర్క్ చేసి టైమ్ ను ఎర్న్ చేస్తానని చెప్తుంది. అలాగే విల్ దగ్గర కూడ చాలా తక్కువ టైమ్ ఉంటుంది. అక్కడ ఏది కొనాలన్నా కూడా డబ్బుల ప్లేస్ లో టైమ్ ను ఉపయోగిస్తారు. కట్ చేస్తే విల్ తన లైఫ్ స్పాన్ కోసం ఓ గ్యాంగ్ స్టార్ తో గొడవ పడి.. టైమ్ ను దొంగతనం చేయాలనీ అనుకుంటారు. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది ? డబ్బు కాకుండా టైమ్ ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి ? చివరికి ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ఇన్ టైమ్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments