Swetha
OTT Best Mystery Thriller : మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తూ ఉంటాయి. అందుకే ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ సారి చెక్ చేసేయండి.
OTT Best Mystery Thriller : మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తూ ఉంటాయి. అందుకే ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ సారి చెక్ చేసేయండి.
Swetha
ప్రస్తుతం ఓటీటీ లో లెక్క పెట్టలేనన్ని సినిమాలు ఉన్నాయి. మూవీ లవర్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా వచ్చిన సినిమాలను వచ్చినవి వచ్చినట్లు చూస్తున్నా కానీ.. ఇంకా చూసేందుకు చాలానే సినిమాలు బ్యాలన్స్ ఉంటున్నాయి. ఇక వాటిలో ఎక్కువమంది చూసే సినిమాలు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్. ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తూ ఉంటాయి. అందుకే ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ లేడీస్ హాస్టల్ లో దుర్భ అనే అమ్మాయి ఉంటుంది. ఆరోజు తన బర్త్ డె కావడంతో చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తన రూమ్ మేట్ మాత్రం ఆమెపై కోపంగా ఉంటుంది. ఇక ఆమె తప్ప ఆ హాస్టల్ లో ఉండే మిగిలిన అమ్మాయిలు , వార్డెన్ అందరు ఆమెను హ్యాపీగా విష్ చేస్తారు. ఆ తర్వాత దుర్భ మళ్ళీ పైకి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రివిక్ అనే అబ్బాయి వచ్చి ఆమెను చూసి నవ్వుతాడు . ఆమె కూడా అతనిని చూసి నవ్వుతుంది. అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉంటారు. రివిక్ ఆ హాస్టల్ ఓనర్ మనవడు. ఈ విషయం ఓనర్ కుముదిని కూడా తెలుసు. ఇక ఆ తరువాత దుర్బ ఆఫీస్ కు వెళ్తుంది. ఆఫీస్ కు వెళ్లిన కొద్దిసేపటికే ఆమె అకస్మాత్తుగా చనిపోతుంది. అందరు ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని అనుకుంటారు. కానీ పోస్టుమార్టంలో మాత్రం విషపూరిత ఆహరం తినడం వలన చనిపోయిందని బయటపడుతుంది.
కట్ చేస్తే ఇప్పుడు ఈ కేసును పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వెంటనే ఆమె హాస్టల్ కు వెళ్లి.. విచారణ చేపడతారు. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో.. దుర్భ ఫ్రెండ్ అనుశ్రీ అక్కడకు వస్తుంది. విషయం తెలుసుకుని బాధపడుతుంది. తనకు ఇంటర్వ్యూ ఉందని.. అదే హాస్టల్ లో ఉంటానని చెప్తుంది. పోలీసులు దానికి ఒప్పుకోకపోయినా సరే.. ఎదో విధంగా వారికి చెప్పి అక్కడే ఉంటుంది. అయితే దుర్భ, రివిక్ ప్రేమించుకున్నారు కాబట్టి.. మర్డర్ కు సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుని.. రివిక్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ కొన్ని లెటర్స్ ఉంటాయి. వాటిని తీసుకుని వచ్చే సమయంలో.. అక్కడ ఎవరో రివిక్ కు ఇంజెక్షన్స్ చేస్తున్నట్లు కనిపిస్తూ.. దీనితో రివిక్ పై అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది ? అక్కడ సైలెంట్ గా మర్డర్స్ చేస్తుంది ఎవరు ? దీనిని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు ? ఇవన్నీ తెలియాలంటే “కుముదిని భవన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.