OTT లో మూడు ఆస్కార్ లు సాధించిన సినిమా ‘గ్రీన్ బుక్’.. ఎక్కడ చూడాలంటే?

OTT Suggestions- Best Feel Good Movie Green Book: రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్న కథలు ప్రేక్షకులను మరింత ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేయండి.

OTT Suggestions- Best Feel Good Movie Green Book: రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్న కథలు ప్రేక్షకులను మరింత ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేయండి.

ఓటీటీ లో చాలా సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ప్రతి వారం కొత్త సినిమాలు కూడా యాడ్ అవుతూ ఉండడంతో ప్రేక్షకులు పాత సినిమాలను మిస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ మూవీ చూసిన తర్వాత మీ స్నేహితుల మీద ఉండే ప్రేమ మరింత పెరుగుతుందని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాను ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు. ఈ సినిమాలో హీరో ఓ నైట్ క్లబ్ లో బౌన్సర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక అతనికి గొడవలు కామన్. అయితే ఓసారి ఆ క్లబ్ ను రీమోడల్ చేయడానికి రెండు నెలలు మూసేస్తారు. దీనితో అతనికి ఉన్నట్లుండి ఉద్యోగం పోతుంది. ఇక ఆ రెండు నెలలు తనకు ఏం చేయాలో అర్ధం కాదు. అదే సమయంలో తన పక్కనే ఉండే ఫ్రెండ్ ను అడుగుతాడు ఏం చేస్తారు అని .. వాళ్లందరికీ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. ఇక హీరోకు మాత్రం ఏమి అర్థంకాక.. సైలెంట్ అయిపోతాడు. ఇంటికి వెళ్లినా కూడా భార్యా పిల్లలతో మాట్లాడకుండ.. దిగాలుగా ఉంటాడు. ఇక అప్పటినుంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈలోపు అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. షెర్లిన్ అనే అతనికి ఒక డ్రైవర్ కావాలని.. తనని అడుగుతాడు.

అతను ఆ కాల్ లో చెప్పిన అడ్రెస్ కు వెళ్తాడు. అయితే షెర్లిన్ అనే వ్యక్తి ఒక నల్ల జాతి వ్యక్తి.. హీరోకు నల్ల జాతి వాళ్ళు అంటే అసలు పడదు. కానీ డబ్బు కోసం అతని దగ్గర డ్రైవర్ ఉద్యోగం ఒప్పుకుంటాడు. ఇక వారు రెండు నెలలు కాన్సెర్ట్ కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. నీకు పెళ్లయింది కాబట్టి నువ్వు ఈ జాబ్ కు అన్ ఫిట్ అని అంటాడు షెర్లిన్.. కానీ నాకు డబ్బు చాలా అవసరం నేను వస్తాను అని హీరో అతనితో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత ఏమౌతుంది ? వీరిద్దరి మధ్య జర్నీ ఎలా సాగుతుంది? అసలు ఈ కథలో ఏం చెప్పబోతున్నారు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు ‘గ్రీన్ బుక్’. ఈ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments