OTT లో వెరైటీ హర్రర్ థ్రిల్లర్.. ‘ఫాంటసీ ఐలాండ్’ మూవీ చూశారా!

OTT Suggestions-Best Horror Thriller Fantasy Island: ఓటీటీ లో హర్రర్ కామెడీ థ్రిల్లర్ చూసి ఉంటారు, అలాగే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చూసి ఉంటారు. కానీ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ చూసారా.. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి మూవీనే. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Suggestions-Best Horror Thriller Fantasy Island: ఓటీటీ లో హర్రర్ కామెడీ థ్రిల్లర్ చూసి ఉంటారు, అలాగే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చూసి ఉంటారు. కానీ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ చూసారా.. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి మూవీనే. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓటీటీ లోకి వచ్చిన హర్రర్ సినిమాలన్నిటిని మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు ఓటీటీ లో హర్రర్ కామెడి, హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చాలా చూసి ఉంటారు. కానీ ఫాంటసీ హర్రర్ మూవీని మాత్రం చూసి ఉండరు. ఇలాంటి సినిమాలను చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ నలభై ఐదేళ్లు ఉన్న ఓ వ్యక్తి ఉంటాడు. అతనికి ఎప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అదేంటంటే వారు ఒక గ్రూప్ తో కలిసి ఓ ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా.. తరచూ వస్తూ ఉంటాయి. అతనికి అలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం , ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ అతనికి అలా వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడంతో .. అందరిని అడుగుతూ ట్రిప్ కు రమ్మని అడుగుతూ ఉంటాడు. కానీ స్ట్రేంజర్ తో ట్రిప్ కాబట్టి ఎవరు ఒప్పుకోరు. అయితే ఇలానే హీరో హీరోయిన్ గ్యాంగ్ మాత్రం ఒప్పుకుంటారు. అదే వాళ్ళు చేసిన మిస్టేక్. దీనితో ఆ పెద్దయ్యానా కల నిజమౌతుందని హ్యాపీ ఫీల్ అవుతాడు. అయితే అతనికి కలలో ఓ క్రేజి ప్లేస్ వస్తుంది. అది నిజంగా బయట ఉందా లేదా అనే దానిపై రీసర్చ్ స్టార్ట్ చేస్తాడు.

కట్ చేస్తే ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తాడు. దాని పేరు ఫాంటసీ ఐలాండ్ .. ఒరిజినల్ పేరు డెత్ ఐలాండ్. ఆ ఐలాండ్ షేప్ కూడా స్కల్ రూపంలో ఉంటుంది. అక్కడే ఉన్న రిసార్ట్ కు ఆ పెద్దాయన ఈ గ్యాంగ్ అందరిని తీసుకుని వెళ్తాడు. అంతా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటర్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది. ఓ రోజు వారు వచ్చిన బోట్ కాలిపోతుంది. అయినా సరే కంగారు పడకుండా.. ఇంకొక బోట్ కు కాల్ చేస్తారు. ఈలోపు అక్కడ ఒక బుక్ కనిపిస్తుంది. అదేంటంటే.. ఆ ఐలాండ్ లోకి వచ్చిన వారంతా చనిపోతారని ఆ బుక్ లో రాసి ఉంటుంది. దీనితో వారికి కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. అసలు బోట్ ఎలా కాలిపోయిందనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది.కట్ చేస్తే వెంట వెంటనే అక్కడికి వచ్చిన వారు ఒక్కొక్కరిగా చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? ఎందుకు ఆ ఐలాండ్ కు వెళ్లిన వారు చనిపోతారు ? ఎలా చనిపోతారు ? చివరికి కథ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే.. ‘బ్లమ్ హౌస్ ఫాంటసీ ఐలాండ్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments