OTT Suggestions- Tipical Love Story Baby Reindeer: ఇలాంటి అమ్మాయి తగిలితే.. అబ్బాయిలకు చావే.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

ఇలాంటి అమ్మాయి తగిలితే.. అబ్బాయిలకు చావే.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

OTT Suggestions- Best Typical Love Story: మీకు ప్రేమకథలు అంటే ఇష్టమా? అయితే ఇది రెగ్యూలర్ లవ్ స్టోరీ కాదు. ఇది కాస్త పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ. చూసేవాళ్లకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఇది.

OTT Suggestions- Best Typical Love Story: మీకు ప్రేమకథలు అంటే ఇష్టమా? అయితే ఇది రెగ్యూలర్ లవ్ స్టోరీ కాదు. ఇది కాస్త పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ. చూసేవాళ్లకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఇది.

ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. అందరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా దానిని అనుభూతి చెందాలి అంటారు. అయితే కొందరికి మాత్రం ఆ ప్రేమ అనేది ఊహించిన శాపంగా కూడా మారుతుంది. మన్మథుడు సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు.. ‘ఆమె ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది’ అని. అలాంటి ఒక పాయింట్ తోనే హాలీవుడ్ నుంచి ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ చూస్తే మీకు నిజంగానే పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఈ ప్రేమకథ కాస్త గాఢంగానే కాదండోయ్.. భారంగా, ఘోరంగా కూడా ఉంటుంది. మరి.. అసలు ఆ కథ ఏంటి? అంత ఘోరంగా ఎందుకు ఉంది? అనే విషయాలు చూద్దాం.

ప్రేమకథలు ఇష్టపడే వారు ఈ వెబ్ సిరీస్ ని కచ్చితంగా చూడాలి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు వన్ సైడ్ లవ్, లవ్ బర్డ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఈ బలవంతపు లవ్ స్టోరీని మాత్రం చూసుండరు. కానీ, ఒక్కోసారి ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం తప్పేముంది అనే భావన కలుగుతుంది. అయితే ఎక్కువగా అందరూ ఆ అబ్బాయి వైపు నుంచే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆమె ఇబ్బంది ఏదైనా కావచ్చు. కానీ, ఒక అబ్బాయిని.. అందులోనూ అమాయకుడిని అలా ప్రేమ పేరుతో బలవంతం చేయడం మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంతేకాకుండా.. అతనికి అప్పటికే ఒక ప్రేయసి కూడా ఉంటుంది.

అతను ఆ యువతి వల్ల దాదాపు ఆరు నెలలు నరకం చూస్తాడు. అప్పటి వరకు ఆమె తన వైఖరి మార్చుకుంటుందని ఎదురుచూస్తాడు. ఆమెకు మానసికంగా కాస్త సపోర్ట్ కావాలి అని జాలిపడి ఆమెను భరిస్తూ వస్తాడు. కానీ, ఆమె మాత్రం అతనిపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. అతనిపై అజమాయిషీ చేస్తుంది. అతడిని వణికించేస్తూ ఉంటుంది. అతను ఒక స్టాండప్ కమెడియన్ చేస్తాడు. అక్కడకు వెళ్లి అతడిని వేధిస్తుంది. అలాగే బార్ టెండర్ గా చేస్తుంటే అక్కడికి కూడా వెళ్లిపోతుంది. ఆమె ప్రేమలో కల్మషం ఉండకపోవచ్చు. కానీ, ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయడం మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. ఆఖరికి అతను పోలీసులను కూడా ఆశ్రయిస్తాడు.

ఆమె కేవలం ప్రేమించమని మాత్రమే చెప్తూ ఉంటుంది. కానీ, అతను మాత్రం ఆమెను యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటాడు. మరి.. చివరికి ఆమె అతని కష్టాన్ని తెలుసుకుని దూరంగా వెళ్లిపోతుందా? అతనే ఆమె ప్రేమను అంగీకరించి కలిసి ఉండాలి అనుకుంటాడా? అసలు ఆ ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? తెలియాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బేబీ రెయిన్ డీర్’ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ లో లీడ్ యాక్టర్స్ ఇద్దరూ తమ యాక్టింగ్ తో మీకు మతి పోగొడతారు. కాకపోతే కాస్త పెయిన్ ఫుల్ గా ఉండే లవ్ స్టోరీ అంతే. మరి.. అలాంటి అమ్మాయి మీకు వస్తే? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments