Tirupathi Rao
OTT Suggestions- Best Korean Drama The Handmaiden: కొరియన్ సినిమాలు అంటే ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ సినిమాలకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కే డ్రామా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సినిమా తీసుకొచ్చాం.
OTT Suggestions- Best Korean Drama The Handmaiden: కొరియన్ సినిమాలు అంటే ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ సినిమాలకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కే డ్రామా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సినిమా తీసుకొచ్చాం.
Tirupathi Rao
ఓటీటీలో చాలానే కొరియన్ డ్రామాలు, కొరియన్ సినిమాలు ఉంటాయి. కానీ, అన్నీ మీకు నచ్చేలా ఉండకపోవచ్చు. అందుకే కొరియన్ డ్రామాలు అనగానే తెలుగు ప్రేక్షకులు కాస్త ఆచి తూచి ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం ఒక క్రేజీ కొరియన్ డ్రామా తీసుకొచ్చాం. ఇది జస్ట్ అలా సాగిపోయే సినిమా కాదు. ప్రతి సీన్ మీలో టెన్షన్ ని, ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. కొరియన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. ఇందులో మీకు డ్రామా, మోసం, యాక్షన్ అన్నీ ఉంటాయి. మరి.. ఆ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ఏది? ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ సినిమా ఎందుకు అంత స్పషలో చూద్దాం.
ఈ సినిమా మొత్తం 1930ల్లో జరిగినట్లు చూపించారు. ఆ సమయంలో కొరియా దేశం జపాన్ పరిపాలనలో ఉంది. ఆ రోజుల్లో అప్పటికీ రాచకుటుంబాలు, రాచరికం ఉంది. ఒకరికి పదవి, అధికారం వస్తోంది అంటే దానిని చెడకొట్టడానికి చాలానే ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు ఒక పెద్ద పథకం రచిస్తారు. ఒక యువరాణినికి దక్కాల్సిన స్థానాన్ని దక్కకుండా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అందులో భాగంగా ఆ యువరాణికి ఒక హ్యాండ్ మెయిడెన్(ప్రత్యేక సేవకురాలు)ను ఏర్పాటు చేస్తారు. చిన్నా చితక దొంగతనాలు చేసుకుని బతికే అమ్మాయిని యువరాణిని దారి తప్పించడం కోసం ఏర్పాటు చేస్తారు. ఆమెకు అప్పజెప్పిన పనిలో ఆ యువతి నిమగ్నమైపోతుంది.
యువరాణిని దారి తప్పించడంలో ఆ దొంగ సక్సెస్ అవుతుంది. రోజూ యువరాణితోనే ఉంటూ.. ఆమెతోనే నిద్రిస్తూ ఉంటుంది. ఆమెతో స్నేహం పెరిగిన తర్వాత శరీరకంగా కూడా దగ్గరవుతుంది. అలాగే యువరాణిని ఆ యువతి తన చెప్పుచేతల్లోకి తీసుకొచ్చుకుంటుంది. వాళ్ల పథకం ఏంటంటే.. యువరాణిని చివరికి పిచ్చాస్పత్రికి పంపించాలి అనుకుంటారు. మరి.. వాళ్లు అనుకున్నది జరిగిందా? ఆ యువతి యువరాణి జీవితాన్ని నాశనం చేసిందా? అనేదే కథ. ఈ సినిమాలో చాలానే ట్విస్టులు, డ్రామాలు ఉంటాయి. ముఖ్యంగా మైండ్ గేమ్స్ ఉంటాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అనే కసి కనిపిస్తుంది. అలాగే మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అనే ప్రశ్న కూడా వస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత సినిమా అయిపోయేవరకు ఆపడం చాలా కష్టం. అక్కడక్కడ మాత్రం కాస్త బో* సీన్స్ ఉంటాయి. ఈ సినిమా పేరు ‘ది హ్యాండ్ మెయిడెన్’. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.