OTT Suggestions- Best K Drama On Netflix: OTTలో బెస్ట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. అంత తేలిగ్గా మర్చిపోలేరు!

OTTలో బెస్ట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. అంత తేలిగ్గా మర్చిపోలేరు!

OTT Suggestions Best K Drama A Killer Paradox: ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకు బాగా డిమాండ్ పెరిగింది. అలాగే వాళ్లు స్టోరీ చెప్పే విధానం కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక బెస్ట్ కే డ్రామా తీసుకొచ్చాం.

OTT Suggestions Best K Drama A Killer Paradox: ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకు బాగా డిమాండ్ పెరిగింది. అలాగే వాళ్లు స్టోరీ చెప్పే విధానం కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక బెస్ట్ కే డ్రామా తీసుకొచ్చాం.

ఓటీటీలో మీరు ఎన్ని సినిమాలు చూసినా కూడా.. సరైన వెబ్ సిరీస్ చూస్తే మాత్రం వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ చూసే అలవాటు ఉన్న వాళ్లకి ఆ ఫీల్ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే సిరీస్ అంటే సినిమాలాగా రెండు గంటల్లో అయిపోదు. కనీసం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని స్కిప్ కూడా చేయలేము. పూర్తి చేయకుండా నిదర పట్టదు. అలాంటి ఫీల్ మీకు తెలియాలి అంటే ఇలాంటి ఒక వెబ్ సిరీస్ చూసేయాల్సిందే. పైగా ఇది కొరియన్ వెబ్ సిరీస్ కావడం ఇంకో విశేషం. ఎందుకంటే కథ చెప్పడంలో కొరియన్ డైరెక్టర్స్ కి ఒక డిఫరెంట్ విధానం ఉంటుంది. ఎంతో ఎంగేజింగ్ గా ఒక అద్భుతమైన లైన్ లో చెప్తూ ఉంటారు.

సాధారణంగా కొరియన్ డ్రామా అనగానే చాలా మంది అది లవ్ స్టోరీ అని భ్రమ పడుతూ ఉంటారు. కానీ, వాళ్లు కేవలం లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా.. మంచి మంచి థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు, సస్పెన్స్ స్టోరీలు చాలానే చేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. పైగా ఇందులో అసలే ఒకటి కాదు రెండు కాదు.. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. ఇది ఒక మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి. చూస్తే.. ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇందులో హీరో విచక్షణారహితంగా హత్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ హత్యలు అన్నీ తనకోసం కాదు.. తన వారి కోసం కాదు.

ఈ సినిమాలో హీరో తనకు తెలియకుండానే.. కావాలి అనుకోకుండానే హత్యలు చేస్తూ ఉంటాడు. అది కూడా ఒకరు ఇద్దరు కాదు.. వరుసగా హత్యలు చేస్తూనే ఉంటాడు. అందుకు కారణం ఏంటి? ఎందుకు అలా చేస్తున్నాడు అని మొదట్లో అతని కూడా తెలీదు. కానీ, అతను చంపుతోంది మాత్రం చెడ్డవాళ్లని అని తెలుసు. అందుకే ఇంక కన్ఫ్యూజ్ కాకుండా దానిని కంటిన్యూ చేయడం స్టారట్ చేస్తాడు. ఈ హత్యలు చేస్తోంది ఎవరో తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు.

అతను కూడా ఈ కేసును చాలా ఇంట్రెస్టింగ్ గా దర్యప్తు చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? అనే విషయాలను కనిపెట్టడానికి చాలా దగ్గరగా వస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించి సీజన్ 1 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ గంట వరకు ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘ది కిల్లర్ పారడాక్స్’. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments