OTT Suggestions- Best Crime Thriller: వరుస హత్యలు.. ఎవరు చంపుతున్నారు? OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

వరుస హత్యలు.. ఎవరు చంపుతున్నారు? OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Investigative Crime Thirller: మీరు ఇప్పటి వరకు ఓటీటీల్లో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిటెక్టివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసుండరు. ఈ మూవీ చూశాక వావ్ అనేస్తారు.

OTT Suggestions- Best Investigative Crime Thirller: మీరు ఇప్పటి వరకు ఓటీటీల్లో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిటెక్టివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసుండరు. ఈ మూవీ చూశాక వావ్ అనేస్తారు.

క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. కానీ, క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఒకపట్టాన నచ్చవు. అలాంటి జానర్లో ఒక బెస్ట్ సినిమా కావాలి అంటే కాస్త వెతుకులాట గట్టిగా చేయాలి. కానీ, ఇప్పుడు మీకోసం ఒక క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో హత్యలు ఉన్నాయి? అవి ఎవరు చేస్తున్నారు అనే కాన్ ఫ్లిక్ట్ ఉంటుంది. అలాగే ట్విస్టులు, మలుపులు, షాకింగ్ ఎలివేషన్స్ అన్నీ కావాల్సినన్ని ఉన్నాయి. మరి.. ఆ మూవీ ఏది? ఎందుకు అంత స్పెషల్? అనే విషయాలు చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది ఒక తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గురించి. ఇది కొత్తగా వచ్చిన మూవీ ఏం కాదులెండి. వచ్చి ఏడాది కావొస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ మూవీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ చిత్రంలో పెద్ద ఎత్తున స్టార్ కాస్ట్ లేకపోవడం ఒక మైనస్ అని చెప్పచ్చు. కానీ, కథ పరంగా, కథనం పరంగా ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక మూవీని నిజంగా ప్రేక్షకులు ఇన్ని రోజులు మిస్ అయ్యారు అనే చెప్పాలి. అందుకే మీకోసం ఈ చిత్రాన్ని సజీషన్ గా తీసుకొచ్చాం. కాకపోతే అక్కడ అక్కడ కాస్త ల్యాగ్ ఉండే భావన మాత్రం తెలుస్తుంది.

సినిమా కథ విషయానికి వస్తే.. ఇది కూడా ఒక మంచి డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో ఆ ఊరిలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మొదట ఒక స్కూల్ పాప హత్యతో అసలు కథ మొదలు అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు చొప్పు వరుసగా చనిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒకోలా చనిపోతూ ఉంటారు. మన హీరో ఈ హత్యలను ఛేదించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. వీళ్లు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లే సరికి చనిపోయి ఉంటారు. అలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. అలా ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. కానీ, పోలీసులకు కూడా అంతు చిక్కదు.

ఒక్క క్లూ కూడా దొరకదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అసలు అవి హత్యలా? ప్రమాదాలా? ఆత్మహత్యలా? ఇలా ఎన్నో ఆసక్తికర అంశాల నడుమ ఈ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ సాగుతూ ఉంటుంది. ప్రతి సీన్ కి ఒక ట్విస్టును మీరు చూడచ్చు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. ఈ మూవీ పేరు డిటెక్టివ్ కార్తీక్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో తెలుగు ఫిల్మ్ నగర్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తి సినిమా అందుబాటులో ఉంది. మీరు గనుక ఈ డిటెక్టివ్ కార్తీక్ సినిమా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments