హత్యలు చేసే టీచర్.. OTT లో బెస్ట్ క్రైమ్ మూవీ! వణికిపోతారు!

OTT Best Crime Investigation Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటిదే కానీ.. ఇక్కడ ఓ వృద్ద జంట ఓ వ్యక్తిని చంపేసి.. నిజం చెప్పిన సరే ఎవరు నమ్మరు. అసలు ఈ కథేంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Crime Investigation Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటిదే కానీ.. ఇక్కడ ఓ వృద్ద జంట ఓ వ్యక్తిని చంపేసి.. నిజం చెప్పిన సరే ఎవరు నమ్మరు. అసలు ఈ కథేంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ , మర్డర్ మిస్టరీస్.. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. కొన్ని సినిమాలలో హంతకులు ఎవరో చివరి వరకు తెలియదు. ఇక కొన్ని సినిమాలలో మాత్రం హంతకులు ఎవరో తెలిసినా కూడా.. ఆ కేసు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ క్రిముల ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మాత్రం కాస్త డిఫరెంట్.. అనుకోకుండా ఓ హత్య చేసిన వృద్ధ జంట.. తామే ఆ హత్య చేశామని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. అసలు ఈ కథేంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ మహిళ తన బట్టలు మార్చుకుంటూ ఉండగా ఎవరో ఒకరు వీడియో తీస్తున్నట్లుగా చూపిస్తారు. అసలు కథేంటంటే.. మిశ్రా అనే ఓ రిటైర్డ్ టీచర్ తన భార్య మంజుతో కలిసి జీవిస్తూ ఉంటాడు. వారి కొడుకు అమెరికాలో నివసిస్తూ ఉంటాడు. ఇక వారం వారం అతని కొడుకుకు స్కైప్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓ రోజు ఇలానే కాల్ చేయగా.. అతను విసుక్కుని కాల్ కట్ చేస్తాడు. దీనితో వీరిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇక మిశ్రా ఖాళీ సమయంలో పిల్లలకు ట్యూషన్ చెప్పడం, మనోహర్ అనే ఓ రైటర్ రాసే హర్రర్ కథలను చదవడం లాంటివి చేస్తూ ఉంటాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా సరే.. తన కొడుకు అడిగాడని అప్పు చేసి అతనిని అమెరికా పంపిస్తాడు. కానీ అతను మాత్రం ఏమి పట్టించుకోడు.

కట్ చేస్తే ఇతనికి అప్పు ఇచ్చిన ఓ గుండా ఎవరో అమ్మాయిని తీసుకుని అర్ధరాత్రి వీరి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. కానీ మిశ్రా చూస్తూ ఉండడం తప్ప ఇంకేమి చేయలేకపోతాడు. ఓ పక్క కొడుకుని తలచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక వారి ట్యూషన్ కు వచ్చే ఓ పాపా నైనా అంటే అతనికి ఎంతో ఇష్టం. ఇక ఆ గుండా వీరిని ఆ ఇంటిని ఖాళీ చేయమని చెప్పడంతో.. అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. కానీ ఆ గొడవ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. కట్ చేస్తే.. మిశ్రా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ గుండా ఇంటికి వచ్చి.. నైనాను ఇంటికి తీసుకురమ్మని అడుగుతాడు. దీనితో మిశ్రా కోపంతో ఆ గుండాను చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? ఈ విషయం పోలీసులకు తెలుస్తుందా ? ఈ మర్డర్ ను ఆ దంపతులు ఎలా కవర్ చేస్తారు ? వారి కొడుకుకు ఈ విషయం తెలుస్తుందా ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “వద్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. సినిమాలు చూసి హత్య.. OTTలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్!

Show comments