Swetha
OTT Best Mystery Thriller: మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నంతసేపు వేరే వరల్డ్ లోకి వెళ్లిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి జోనర్ సినిమాలు ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
OTT Best Mystery Thriller: మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నంతసేపు వేరే వరల్డ్ లోకి వెళ్లిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి జోనర్ సినిమాలు ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
Swetha
కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మన బ్రెయిన్ అంతా కూడా.. ఆ సినిమా తప్ప ఇంకేమి మైండ్ లోకి రావు. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఎక్కువగా బ్రెయిన్ ను ఆలోచింపజేసే సినిమాలంటే మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ అని చెప్పి తీరాల్సిందే. ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కొరియన్ సినిమాలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ లేడి ట్విన్స్ కు జన్మనిస్తుంది. కానీ ఆ ట్విన్స్ లో ఓ బిడ్డ కాలు ఎవరో కొరికి తిన్నట్లుగా ఉంటుంది. ఆ కాలు కొరికి తిన్నది లోపల ఉన్న మరొక బిడ్డ.. ఆ బిడ్డ బయటకు డెలివరీ కాగానే చనిపోతుంది. దీనితో బ్రతి ఉన్న ఆ ఒక్క బిడ్డనే వారు గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇక ప్రెసెంట్ లో ఆ బిడ్డ పెద్దదయ్యి తనకు జరిగింది చెప్తుంది. నన్ను కడుపులోనే తినేసిన రాక్షసి చనిపోయిందని అందరు అనుకుంటున్నారు. కానీ ఆమె బ్రతికే ఉంది. ఆమె కారణంగానే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అమ్మమ్మ తాతయ్యలే నన్ను పెంచారు. అని చెప్తుంది. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు.
ఇక్కడ ఒక లేడి పూజలు చేస్తూ కనిపిస్తుంది. ఆ ఊరిలో పశువులు అన్ని కారణం లేకుండా చనిపోతూ ఉంటాయి. అందుకోసం ఊరివాళ్ళు ఆమెను పిలిపిస్తారు. దీనితో ఆమె ఓ ఇంటివైపు కోపంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ ఇంట్లో ఎదో నెగిటివ్ వైబ్స్ ఉన్నయాని ఆమెకు అర్ధమౌతుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదు హీరోయిన్ దే. అయితే ఇక్కడ హీరోయిన్ తో పాటు ఆమె కాలును కడుపులోనే తినేసిన ఆమె కూడా బ్రతికే ఉంటుంది. వారిద్దరిని కూడా అమ్మమ్మ తాతయ్యలే పెంచుతారు. హీరోయిన్ అక్కకు భయపడి.. ఆమెను ఓ గదిలో బంధించి ఉంచుతారు. ఇక కట్ చేస్తే ఇక్కడ హీరోను చూపిస్తారు.
అతను ప్రపంచంలోని దొంగ బాబాలను , ఫాదర్ లను బయటకు లాగడం. ఆ తర్వాత ఏం జరిగింది ? హీరోకు హీరోయిన్ కు ఉన్న సంబందం ఏంటి ?అసలు కడుపులో ఉండగానే తన చెల్లి కాలును ఆమె ఎందుకు తినేస్తుంది ? పుట్టిన వెంటనే చనిపోయింది అనుకున్న ఆ పాపా ఎలా బ్రతికింది ? ఆ తర్వాత ఈ కథ ఎలా ముందుకు సాగింది ? ఇవన్నీ తెలియాలంటే “స్వాహా:ది సిక్స్త్ ఫింగర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. OTT లో డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది.