Best Thriller Movie In OTT: మహిళ గతం మర్చిపోడంతో.. తానే భర్తనంటూ ఓ సైకో! OTT లో థ్రిల్లింగ్ మూవీ

మహిళ గతం మర్చిపోడంతో.. తానే భర్తనంటూ ఓ సైకో! OTT లో థ్రిల్లింగ్ మూవీ

Best Thriller Movie In OTT: సైకో థ్రిల్లర్ సినిమాలు ఎండ్ వరకు కూడా కదలకుండా కూర్చుని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Thriller Movie In OTT: సైకో థ్రిల్లర్ సినిమాలు ఎండ్ వరకు కూడా కదలకుండా కూర్చుని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ మంచి కిక్ ఇచ్చే థ్రిల్లర్ మూవీస్ మాత్రం ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడాలంటే మాత్రం సెర్చ్ లిస్ట్ లో కాస్త వెనక్కు వెళ్లాల్సిందే. అదేంటో తెలియదు కానీ సైకో థ్రిల్లర్ సినిమాల ఎండ్ వరకు కూడా అసలు కదలకుండా కూర్చుని చూడాలనిపిస్తుంది. సైకో కిల్లర్స్ మనుషుల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు . వారిని ఎలా చంపుతున్నారు. చివరికి ఆ సైకో కిల్లర్ ను పెట్టుకున్నారా లేదా.. ఇలా చివరి వరకు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే కానీ కాస్త డిఫరెంట్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ మూవీ స్టార్టింగ్ లో జెన్నిఫర్ అనే అమ్మాయి ఓ వ్యక్తి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో తనకు ఓ కార్ డాష్ ఇస్తుంది. దీనితో ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది. అప్పుడు తనని చూడడానికి తన భర్త రాయన్ వస్తాడు. అప్పుడు జెన్నిఫర్ తన గతాన్ని మర్చిపోయానని డాక్టర్ కు చెప్తుంది. దీనితో రయన్ వెళ్లి జెన్నిఫర్ కు తమ పెళ్లి ఫోటోలు చూపిస్తాడు. తన కాస్త కోలుకోగానే ఇంటికి తీసుకుని వస్తాడు. యాక్సిడెంట్ కేసు అవ్వడంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి.. ఓ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. ఇది కేవలం యాక్సిడెంట్ కాదని దీని వెనుక ఇంకేదో ఉందని డిటెక్టీవ్ బలంగా నమ్ముతాడు. అందుకోసం రయన్ ను విచారణకు రమ్మంటాడు. రయన్ వస్తానని చెప్పి రాడు. దీనితో అతని అనుమానం ఇంకాస్త పెరుగుతుంది. అప్పటినుంచి జెన్నిఫర్ గురించి మరిన్ని వివరాలు కనుక్కోవడం మొదలు పెడతాడు. మరో వైపు జెన్నీ కి రయన్ తన భర్త కాదేమో అనే అనుమానం పెరిగిపోతూ ఉంటుంది. తనని దూరం పెడుతూ ఉంటుంది.

ఇక జెన్నీ వివరాలను కనుక్కుంటున్న డిటెక్టీవ్ కు జెన్నీ గురించి కొన్ని అనుకోని విషయాలు తెలుస్తాయి . హాస్పిటల్ లో జెన్నీ వివరాలను సంపాదించి.. తన తల్లి దండ్రుల ఇంటికి వెళ్తాడు. అక్కడ జెన్నీ పేరెంట్స్ చాలా కాలం క్రితమే హత్య చేయబడి.. వారి శవాలు కుళ్లిపోయి ఉంటాయి. దీనితో రయన్, జెన్నీ భార్య భర్తలు కాదనే విషయం బయటపడుతుంది. మరోవైపు జెన్నీ కూడా రయన్ ల్యాప్ టాప్ ఓపెన్ చేసి చూడగా.. రయన్ తన భర్త కాదనే విషయం తెలుసుకుంటుంది. అసలు రయన్ ఎవరు ! ఎందుకు జెన్నీ తన భార్య అని చెప్తాడు ! డిటెక్టీవ్ జెన్నీని తన నుంచి కాపాడడ లేదా ! జెన్నీ తర్వాత ఏం చేసింది ! ఆ తర్వాత కథ ఎలా ముందుకు సాగింది! ఇవన్నీ తెలియాలంటే “సీక్రెట్ ఆబ్సెషన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments