OTT Suggestion-Best Historical Action Drama: OTTలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ 'పథానపథం నూత్తాండు'.. ఇది నిజంగా జరిగిన కథ!

OTTలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘పథానపథం నూత్తాండు’.. ఇది నిజంగా జరిగిన కథ!

OTT Best Historical Action Drama: రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని రూపొందించే కథలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు.. ఇప్పటివారికి అసలు చరిత్రలో ఏం జరిగింది అనే నిజాలను కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

OTT Best Historical Action Drama: రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని రూపొందించే కథలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు.. ఇప్పటివారికి అసలు చరిత్రలో ఏం జరిగింది అనే నిజాలను కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

చారిత్రిక కథలు చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. అలానే ఈ సినిమాల వలన చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. చరిత్రలో కనుమరుగైపోయిన ఎంతో మంది గొప్ప వారి గురించి… ఇప్పటివారు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇలాంటిదే. అసలైన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉండే కాలంలో కథను స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో అప్పటి పరిపానలో ఉండే వారు.. ప్రజలకు రకరకాల పన్నులు విధిస్తు ఉండేవారు. వీటితో పాటు చాలా రకాల శిక్షలు కూడా విధించేవారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి వీటిని ఎదిరించి .. పోరాడి చనిపోతాడు. అతని పేరు వేలాయుద.. హిస్టరీలో ఇతని గురించి ఎక్కువ రాయకపోవడంతో .. తర్వాత తరాల వారికి అతని కథ తెలీకుండా పోయింది. ఆ వేలాయుద కథే ఈ మూవీ కథ. అప్పట్లో బ్రిటిషర్లు అక్కడి ప్రజలను ఏ విధంగా హింసించేవారో ఇప్పటికే ఎన్నో సినిమాలలో చూపించారు. ఈ క్రమంలో ఓ రోజు కుస్తీ పోటీలు జరుగుతున్న ప్రదేశానికి వేలాయుద వెళ్తాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తాడు. వేలాయుద తక్కువ జాతి వాడు కావడంతో.. బ్రిటిషర్లు వేలాయుద మీద గన్ ఫైరింగ్ చేయగా.. కష్టం మీద అతను అక్కడ నుంచి తప్పించుకుంటాడు.

కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత కథను చూపిస్తారు. అక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో నగదు పోయింది.. కానీ దానిని ఎవరు దొంగలించారో తెలియడం లేదని దాని గురించి.. ఓ సభను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో వేలాయుద కూడా ఆ సభకు హాజరౌతాడు. ఆ రాజు దొంగను పట్టుకునే బాధ్యత వేలాయుద కు అప్పగించగా.. మిగిలిన వారంతా దీనిపై వాదోపవాదలు చేస్తారు. దీనితో రాజు వేలాయుదను తిరిగి పంపించేస్తాడు. ఈ క్రమంలో కన్నన్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ తో వేలాయుదకు పరిచయం ఏర్పడుతుంది. మరో వైపు భూస్వాములు.. స్త్రీలకు అనేక రకాల శిక్షలు విధిస్తారు. వీటన్నిటిని వేలాయుద ఎలాంటి పోరాటం చేశాడు అనేది తెరపై చూడాల్సిన కథ. ఈ సినిమా పేరు “పథానపథం నూత్తాండు”. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులో పులి అనే పేరుతో ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments