ఒక అమ్మాయి 5గంటలు ఫ్రిడ్జ్ లో ఉంటే! OTT లో రియల్ ఎమోషనల్ స్టోరీ

OTT Emotional Drama: కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని రూపొందిస్తు ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇంతే.. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

OTT Emotional Drama: కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని రూపొందిస్తు ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇంతే.. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఫిక్షనల్ కథలైతే.. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినవి. ఇలాంటి కథలు చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని కథలు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటూ ఉంటాయి. వాటిలో సర్వైవల్ డ్రామాస్ ఈ మధ్య అందరిని మెప్పించేస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇది నిజంగా జరిగిన ఒక కథ. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హెలెన్ అనే అమ్మాయి బీఎస్ఎస్సి నర్సింగ్ చదువుతుంది. ఆమె ఎలాగైనా ఫారెన్ వెళ్లి పెద్ద చదువులు చదవాలని కలలు కంటూ ఉంటుంది. ఆమెకు తల్లి లేకపోవడంతో తన తండ్రి ఆమెను గారాబంగా పెంచుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఈమె నచ్చేస్తుంది. ఫారెన్ వెళ్లడం కోసం ఐఈఎల్టీఎస్ లో కోచింగ్ తీసుకుంటూ.. అక్కడే ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటుంది. ఇక హెలెన్ నాన్న ఎల్ఐసి లో పని చేస్తూ ఉంటాడు. అతనికి హెలెన్ విదేశాలకు వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ తన కూతురు కోసం ఒప్పుకుంటాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇక హెలెన్ కు అజార్ అనే లవర్ కూడా ఉంటాడు. వీరిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్ ఉంటుంది. అంతా బాగానే సాగిపోతూ ఉంటుంది.

ఓ రోజు అజార్ హెలెన్ ను ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు.. దారి మధ్యలో వారిని పోలీసులు ఆపేస్తారు. అప్పటికే అజార్ డ్రింక్ చేసి ఉండడంతో… వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీనితో హెలెన్ తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. ఇక అప్పటినుంచి ఆ తండ్రి కూతుళ్ళ మధ్య మాటలు ఉండవు. దీనితో అప్పటినుంచి హెలెన్ జీవితం అంతా మారిపోతుంది. ఓ రోజు ఆ బాధలో ఇంటికి వెళ్లడం ఇష్టం లేక తన వర్క్ చేస్తున్న షాప్ లోనే లేట్ నైట్ వరకు ఉంటుంది. అది ఎవరు గమనించరు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కొన్ని పార్సిల్స్ వస్తాయి. ఆ పార్సిల్స్ తెచ్చిన వారు ఆమెకు అవి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనితో హెలెన్ వాటిని కోల్డ్ రూమ్ లో పెట్టడానికి వెళ్తుంది. ఈలోపే లోపల ఎవరో డోర్ వేయడం మర్చిపోయారని.. ఎవరో డోర్ క్లోస్ చేసేస్తారు. ఆమె ఫోన్ కూడా బయట ఉంటుంది. హెలెన్ ఆ కోల్డ్ రూమ్ లో నుంచి బయట పడిందా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? అనేది తెలియాలంటే “హెలెన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments