సరిపోదా శనివారం OTT రిలీజ్ డేట్ ఇదే..

Saripodhaa Sanivaaram Movie OTT Streming Date: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది.

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా సరిపోదా శనివారం. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో..  మొదటి నుంచి ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో, నాని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ భారీ అంచనాల నడుమ గతనెల  ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజై మంచి హిట్ అందుకుంది. దీంతో పాటు కాలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఓ వైపు థియేటర్స్ లో కలెక్షన్స్ దూసుకుపోతున్న ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనని మూవీ లవర్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ భారీ హక్కులకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమా ఈ సెప్టెంబర్ 27 నుంచి ఓటీటీల స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ విషయం ఇటు మూవీ మేకర్స్ కానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి కానీ అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Show comments