iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో అందరి చూపు ఆ 4 సినిమాల మీదే.. అవేంటంటే!

  • Published Jul 30, 2024 | 5:00 AM Updated Updated Jul 30, 2024 | 5:00 AM

This Week Special Movies In OTT: ప్రతి వారం లానే ఇప్పుడు మరొక వారం వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే లిస్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో ఈ వారం చూడదగిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

This Week Special Movies In OTT: ప్రతి వారం లానే ఇప్పుడు మరొక వారం వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే లిస్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో ఈ వారం చూడదగిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Jul 30, 2024 | 5:00 AMUpdated Jul 30, 2024 | 5:00 AM
ఈ వారం OTT లో అందరి చూపు ఆ 4 సినిమాల మీదే.. అవేంటంటే!

ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నా కూడా.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. పైగా ఆ సినిమాలే ఓటీటీ లో బెస్ట్ గా నిలుస్తాయి. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో రాగా… వాటిలో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మాత్రం కొన్నే. పైగా థియేటర్ లో హిట్ కానీ సినిమాలు సైతం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో ట్రేండింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆల్రెడీ గత వారం రిలీజ్ అయినా సినిమాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో చూడదగిన సినిమాలేంటో .. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

బృందా వెబ్ సిరీస్

This week OTT special movies

వెబ్ సిరీస్ లను ఇప్పుడు అందరు ఎంతో బాగా ఆదరించడంతో.. కనీసం వారంలో ఒక కొత్త వెబ్ సిరీస్ నైనా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పైగా తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా పెరగడంతో.. వరుసగా ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలుగు సిరీస్ లే రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష నటించిన “బృందా” వెబ్ సిరీస్.. ఆగష్టు 2 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. అది కూడా తెలుగులో. కాబట్టి ఎంచక్కా ఈ సిరీస్ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి.

మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి

This week OTT special movies

దర్శక ధీరుడు రాజమౌళి పై డాక్యుమెంటరీ అంటే.. మాటలు కాదు. దీని గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా .. ఇది ఎలా ఉంటుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ డాక్యుమెంటరీ కూడా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిలో రాజమౌళి పై కొంతమంది టాలీవుడ్ , బాలీవుడ్ స్టార్స్ చెప్పే అభిప్రాయాలను కూడా చూడొచ్చు. కాబట్టి ఈ వారం ఈ డాక్యుమెంటరీ ని అసలు మిస్ చేయకుండా చూసేయండి.

డ్యూన్: పార్ట్ 2

This week OTT special movies

హాలీవుడ్ మూవీ డ్యూన్ కు విశేష ఆదరణ లభించడంతో.. దానికి కంటిన్యుషన్ గా తెరకెక్కించిన సినిమా డ్యూన్ పార్ట్ 2. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా కాలమే అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఈ సినిమా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

కింగ్‌‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్

This week OTT special movies

ఈ సినిమా 2024లో విడుదల అయింది. ఈ సినిమాకు.. వెస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ.. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే సినిమాకు సిక్వెల్. కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా ఆగష్టు 2 నుంచి తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో అస్సలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు ఇవే. ఇవి కాకుండా వీకెండ్ లోపు ఇంకా కొత్త సినిమాలు వచ్చే అవకాశలు లేకపోలేదు.