OTT Movie: ఆవారా లాంటి చిత్రం మరో OTTలోకి.. ఇక్కడ కాస్త రొమాన్స్ ఎక్కువే

ఆవారా లాంటి చిత్రం మరో OTTలోకి.. ఇక్కడ కాస్త రొమాన్స్ ఎక్కువే

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. ఇలా థియేటర్లలో రిలీజైన చిత్రాలు.. నెల తిరగకుండానే ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. దీంతో థియేటర్లలో మిస్ అయ్యామని ఫీల్ అయినా వాళ్లంతా.. ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ చిత్రం.. సందడి చేస్తుంది.

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. ఇలా థియేటర్లలో రిలీజైన చిత్రాలు.. నెల తిరగకుండానే ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. దీంతో థియేటర్లలో మిస్ అయ్యామని ఫీల్ అయినా వాళ్లంతా.. ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ చిత్రం.. సందడి చేస్తుంది.

శుక్రవారం వచ్చిందంటే థియేటర్లు ఎంత కళకళలాడుతుంటాయో.. ఓటీటీలు కూడా కొత్త కొత్త సినిమాలతో మూవీ లవర్స్‌ను పిచ్చెక్కిస్తుంటాయి. వీకెండ్‌లో ఏ మూవీలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయా అని ఎదురు చూస్తుంటారు. కొంత మంది క్రైమ్, హారర్, థ్రిల్లర్ వంటి చిత్రాలను ఇష్టపడితే.. మరికొంత మంది రొమాంటిక్ మూవీస్ కోసం వాచ్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ.. సినిమా బాగుందని టాక్ నడిస్తే.. జోనర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటారు మూవీ లవర్స్. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. గతంలోనే ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కాగా, ఇప్పుడు మరో ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ఆవారా తరహాలో ఈ సినిమా ఉంటుంది. అయితే అక్కడ చాలా కూల్ అండ్ కామ్ అయితే.. ఇక్కడ రచ్చ రచ్చే.

ఓటీటీ హీరోగా ముద్ర పడ్డాడు నరేష్ అగస్త్య. అతడు హీరోగా నటించిన చిత్రం ‘మాయలో’. 2023లో తెలుగులో విడుదలైన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌. ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ బ్యానర్‌పై షాలిని నంబు, రాధాకృష్ణ నంబు నిర్మించిన ఈ సినిమాకు మేఘా మిత్ర పేర్వార్‌ దర్శకత్వం వహించాడు. నరేశ్‌ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, ఆర్జే హేమంత్ ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో నటించిన గత ఏడాది డిసెంబర్ 15న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. శుక్రవారం నుండి మరో ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.

క్రిష్ (నరేష్), సింధు అయ్యర్ (భావన), మాయ ( జ్ఞానేశ్వరి కాండ్రేగుల)చిన్న నాటి నుండి ఫ్రెండ్. క్రిష్, మాయను ప్రేమిస్తాడు. కానీ మాయ మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. తన పెళ్లికి రమ్మని క్రిష్, భావనలను ఆహ్వానిస్తుంది. పేరుకు చిన్నప్పటినుంచి ఫ్రెండ్సే అయినప్పటికీ వీళ్లకు ఒకరంటే ఒకరికి అంతర్గతంగా పడదు. ముఖ్యంగా క్రిష్ అండ్ సింధుకు. అయితే మాయ పెళ్లికి క్రిష్, సింధులు ఓ కారు అద్దెకు తీసుకుని వెళతారు. మార్గమధ్యంలో సింధుకు, క్రిష్‌కు మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ స్నేహితుల కథేంటీ..? మంచి ఫ్రెండ్స్ అయిన మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? సింధుకు.. క్రిష్ పట్ల ఉన్న అభిప్రాయం మారుతుందా..? అసలు మాయ.. క్రిష్ ను ఎందుకు నిరాకరించింది. సింధు, క్రిష్ పెళ్లి వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనేదే మిగతా సినిమా కథ. రొమాంటిక్ స్టోరీ అయినా ఫీల్ గుడ్ చిత్రంగా అనిపిస్తుంది.. చూసి ఎంజాయ్ చేయండి.

Show comments