Maharaja OTT: అఫీషియల్ : మహారాజ OTT స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్.. ఎప్పటినుంచంటే!

Maharaja OTT Release Date & Streaming Platform: తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Maharaja OTT Release Date & Streaming Platform: తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఇప్పుడు దాదాపు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం క్రేజ్ ని బట్టి థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా.. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఊహించని రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకుంది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లో ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గతంలో మహారాజ ఓటీటీ డేట్ ఇదేనంటూ టాక్ వినిపించినా కానీ అది కన్ఫర్మ్ కాలేదు. ఇక ఇప్పుడు మహారాజ ఓటీటీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

మహారాజ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లోనే 50వ సినిమాగా.. రిలీజ్ కు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ గా నటించగా.. అతనితో పాటు మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు అఫీషియల్ డేట్ వచ్చేసింది. మహారాజ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మహారాజ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో విజయ్ మహారాజ అనే ఓ బార్బర్ పాత్రలో నటించారు. మహారాజ భార్య చనిపోయిన తర్వాత అతను తన కూతురు జ్యోతితో కలిసి జీవిస్తూ ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఓ రోజు సడన్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. తనపై ఓ ముగ్గురు దాడి చేసారని.. తన కూతురిని , కాపాడిన లక్ష్మిని అపహరించారని.. ఎలాగైనా లక్ష్మిని కాపాడాలని .. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. అయితే లక్ష్మి పోలికల గురించి మాత్రం సరిగ్గా చెప్పడు. దీనితో పోలీసులు కంప్లైంట్ తీసుకునేందుకు ఆలోచిస్తారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుంటారు. అసలు మహారాజ పై దాడి చేసింది ఎవరు ! తనకు ఉన్నది ఒక కూతురే కదా లక్ష్మి ఎవరు ! లక్ష్మి అంటే డబ్బా లేక మనిషా ! చివరికి లక్ష్మిని పెట్టుకున్నారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments