OTT లో తెలుగులోకి వస్తున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘శాఖాహారి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Murder Mystery Thriller Shakhahaari OTT Streaming In Telugu: ఈ మధ్య కాలంలో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ముందుగా ఒరిజినల్ భాషలో రిలీజ్ అయినా సినిమాలు.. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక మూవీ యాడ్ అయింది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

Murder Mystery Thriller Shakhahaari OTT Streaming In Telugu: ఈ మధ్య కాలంలో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ముందుగా ఒరిజినల్ భాషలో రిలీజ్ అయినా సినిమాలు.. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక మూవీ యాడ్ అయింది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. వాటిలో ముందుగా అందరు సెర్చ్ చేసేది తెలుగు సినిమాల కోసమే కాబట్టి.. ఇప్పటికే ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల లిస్ట్ వచ్చేసి ఉంటుంది. ఆ లిస్ట్ లో అందరి మోస్ట్ అవైటెడ్ మూవీస్ కల్కి, రాయన్ సినిమాలు ముందుటాయి. దానితో పాటు వరుణ్ సందేశ్ విరాజి మూవీ కూడా ఈ వారం ఓటీటీ లోకి రాబోతుంది. ఇక ఇప్పుడు ఈ వారం తెలుగు సినిమాలా లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఓటీటీ లో రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. మే24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘శాఖాహారి’. చిన్న సినిమాగా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. కేవలం ఒరిజినల్ భాషలోనే రిలీజ్ చేసినా కానీ.. ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కాయి. ఇక ఇప్పుడు తెలుగు కంటెంట్ కు మంచి ఆదరణ పెరగడంతో.. ఈ సినిమాను కూడా తెలుగు వెర్షన్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. శాఖాహారి తెలుగు వెర్షన్ ను ఆగస్ట్ 24 నుంచి .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం.. ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.

ఇక శాఖాహారి సినిమా కథ విషయానికొస్తే… సుబ్బన్న అనే వ్యక్తి.. ఓ శాఖాహార హోటల్ ను నడుపుతూ ఉంటాడు. అతను పెళ్లి చేసుకోకుండా.. ఎలాంటి రిలేషన్స్ లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ.. ఆ హోటల్ ను నడుపుతూ ఉంటాడు. అప్పటివరకు ఒంటరిగా ఉన్న అతని జీవితంలోకి సడెన్ గా ఓ రోజు వినయ్ అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు. వినయ్ అప్పటికే తన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉంటాడు. దీనితో వినయ్ పోలీసుల నుంచి తప్పించుకుని.. సుబ్బన్న హోటల్ లో కు వస్తాడు. ఈ క్రమంలో పోలీసులు కూడా అతనిని వెతుక్కుంటూ సుబ్బయ్య హోటల్ కే వస్తారు. కానీ అనూహ్యంగా అక్కడ వినయ్ విషయం కాకుండా సుబ్బన్న గురించి షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఇంతకీ ఆ విషయాలు ఏంటి ? సుబ్బన్నకు ఏదైనా సమస్యలు ఉన్నాయి? అసలు అక్కడ ఏమై ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments