జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో ఇంట్రస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. చెమటలు పట్టిస్తుంది

మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబోల్లో ఒకటి జీతూ జోసెఫ్- మోహన్ లాల్. వీరిద్దరి కాంబోలో దృశ్యం, దృశ్యం 2 ఎంతటి పెద్ద హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. ఇదే కాంబోలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. చూడకుంటే చూసేయండి.

మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబోల్లో ఒకటి జీతూ జోసెఫ్- మోహన్ లాల్. వీరిద్దరి కాంబోలో దృశ్యం, దృశ్యం 2 ఎంతటి పెద్ద హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. ఇదే కాంబోలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. చూడకుంటే చూసేయండి.

కేరళ ప్రకృతి అందాలకే పరవశించిపోవడం కాదు.. అక్కడి చిత్రాలకు సైతం మైమరిచిపోతుంటారు తెలుగు ప్రజలు. ముఖ్యంగా మాలీవుడ్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిక్కడ. చిన్న లైన్‌తో సినిమా మొత్తం తీసేసి హిట్ కొట్టేస్తుంటారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై.. టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా నిలుస్తాయి. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం, గోట్-ఆడు జీవితం. మలయాళంలో తెరకెక్కించే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఏడాదిలో ఇలాంటి సినిమాలు 5 నుండి 10 వరకు వస్తున్నాయి. ప్రేక్షకులు..వాట్ నెక్స్ట్ అనిపించేలా తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ మూవీని మీ కోసం సజెస్ట్ చేయబోతున్నాం. ఈ సినిమా చూడకుండా ఉంటే చూసేయండి.

జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ కొట్టాయో తెలుసు. ఇప్పుడు కాంబోలో వచ్చిన మరో మూవీ 12th మాన్. 2022లో మలయాళంలో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా 12th మాన్. ఆశీర్వాద్ సినీ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్. కృష్ణ కుమార్‌ కథ అందించాడు. జీతూ జోసేఫ్‌ దర్శకుడు. మోహన్‌ లాల్‌, ఉన్ని ముకుందన్‌, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్‌, లియోనా లిషాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలైంది. 2022 మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. జీతూ జోసెఫ్ టేకింగ్ స్కిల్ తెలిసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఇక కథ విషయానికి వస్తే.. 11 మంది మంచి ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని తమ వాట్సప్ గ్రూపులో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 అయితే ఈ ఫ్రెండ్ గ్రూపులో యానీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని డాక్టర్ ఫ్రెండ్ దగ్గర మాట తీసుకుంటుంది. అంతలో స్నేహితుల్లో ఒకరైన సిద్దు పెళ్లి జరుగుతుండగా.. అతడు ఓ రిసార్టులో పార్టీ ఏర్పాటు చేస్తాడు. అక్కడ చెప్పాలనుకుంటుంది యానీ. కానీ ఊహించని విధంగా అందరికీ ఈ విషయం ముందే తెలిసిపోతుంది. అక్కడ ఎంటర్ అవుతాడు చంద్రన్ (మోహన్ లాల్). అక్కడ ఈ ఫ్రెండ్స్, మోహన్ లాల్‌కు మధ్య చిన్న తగాదా ఏర్పడుతుంది. అంతలో ఫ్రెండ్స్ అంతా.. ఏ ఫోన్ వచ్చినా.. స్పీకర్ అన్ చేసి మాట్లాడాలని, అలాగే మేసేజ్ వచ్చినా.. గట్టిగా చదివి వినిపించాలని అనుకుంటారు. అప్పుడు సమస్యలు ఎదురౌతాయి. అంతలో మాథ్యూ భార్య షైనీ చనిపోతుంది. అంతలో ఈ కేసును మోహన్ లాల్ టేకప్ చేస్తాడు. ఇంతకు షైనీ ఎందుకు చనిపోయింది.. ఈ కేసును చంద్రన్ ఎలా డీల్ చేశాడు అనేది మిగిలిన కథ.

Show comments