Swetha
ఇప్పటికే ఓటీటీ లో ఎంత చూసినా తరగని సినిమాలు ఉన్నాయంటే.. ఇప్పుడు ఇంకా ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది.
ఇప్పటికే ఓటీటీ లో ఎంత చూసినా తరగని సినిమాలు ఉన్నాయంటే.. ఇప్పుడు ఇంకా ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది.
Swetha
వెబ్ సిరీస్ లు ఇప్పుడు అందరి దృష్టిని కట్టిపడేస్తున్నాయి. దీనితో మేకర్స్ కూడా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతి వారం పదుల కొద్దీ సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఓటీటీ లో ఎంత చూసినా తరగని సినిమాలు ఉన్నాయని చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు వస్తున్నా సినిమాలే కాకుండా ఆల్రెడీ ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. దీనితో ఈ మధ్య ఈ సినిమాను మీరు చూశారా అంటూ.. కొన్ని మూవీ సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. లేటెస్ట్ గా మరొక వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మైమరిపిస్తున్నాయో ప్రత్యెఅంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా మరేదో కాదు.. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్.. రాజేష్ రిజి నాయర్ రూపొందిస్తున్న మలయాళ పొలిటికల్ సిరీస్ “జై మహేంద్రన్” . ఈ సిరీస్ లో సాజుకురుప్, మియాజార్జ్ , సుహాసిని మణిరత్నంలు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. అయితే ఈ సిరీస్ ను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. ఇంకా స్ట్రీమింగ్ డేట్ అయితే రాలేదు కానీ.. ఆగష్టు నెలలోనే ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్ విడుదల అయ్యేదే కానీ.. కొన్ని సీన్స్ , డైలాగ్స్ పైన అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో.. ఆ సీన్స్ ను రీషూట్ చేసినందువలనే.. స్ట్రీమింగ్ ఆలస్యం అయినట్లే సమాచారం.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే.. సాధారణంగా పొలిటికల్ థ్రిల్లర్ అనగానే.. రాజకీయాల్లో జరుగుతున్న సంఘటనల గురించే చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సిరీస్ లో కూడా దాదాపుగా ఇలాంటి కథనే చూపించబోతున్నారు. ప్రభుత్వ అధికారుల్లోని లంచగొండితనం, సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తూ.. రూపొందించబడినదే.. ఈ సిరీస్. అయితే సోనీలివ్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ మలయాళం సిరీస్ ఇదే అవ్వడం విశేషం. పైగా ఈ సిరీస్ మళయాళంతో పాటు.. తెలుగు , తమిళం , కన్నడ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.