Swetha
OTT New Releases-Horror Movie Mayanizhal:హర్రర్ మూవీస్ ను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఆల్రెడీ ఓటీటీ లో ఎన్ని మూవీస్ ఉన్న ఉన్నా కానీ.. ఏదైనా కొత్త హర్రర్ మూవీ వస్తుందంటే అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.
OTT New Releases-Horror Movie Mayanizhal:హర్రర్ మూవీస్ ను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఆల్రెడీ ఓటీటీ లో ఎన్ని మూవీస్ ఉన్న ఉన్నా కానీ.. ఏదైనా కొత్త హర్రర్ మూవీ వస్తుందంటే అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.
Swetha
కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం నెలలు , సంవత్సరాలు గడిచిపోతున్నా ఓటీటీ స్ట్రీమింగ్ కు మాత్రం నోచుకోవు. ఈ మధ్య డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు క్రేజ్ బాగా పెరగడంతో.. ఎప్పటినుంచో రిలీజ్ చేయాలనీ అనుకుని ఆగిపోయిన సినిమాలన్నిటిని.. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా మూడేళ్ళ తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. కాబట్టి ఈ హర్రర్ మూవీని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా మరేదో కాదు.. నయనతార హీరోయిన్ గా నటించిన హర్రర్ మూవీ.. నిజాల్. ఈ సినిమాకు అప్పు ఎన్ భట్టాత్రి డైరెక్టర్ గా వ్యవహరించారు. కాగా ఈ సినిమాలో నయనతారతో పాటు.. కుంచకోబోబన్ ప్రధాన పాత్రలో నటించాడు. 2021లో థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. అప్పట్లో మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ తమిళ్ వెర్షన్ డైరెక్ట్ గా ఓటీటీ లో.. మాయానీజాల్ పేరుతో రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ మూవీ ఆహ తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఎలాగూ తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగానే లభిస్తుంది కాబట్టి.. త్వరలోనే ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో జాన్ అంటే న్యాయమూర్తి.. ఓ యాక్సిడెంట్ కారణంగా ముఖానికి వింత మాస్క్ ధరించాల్సి వస్తుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత జాన్ జీవితం మొత్తం మారిపోతుంది. అప్పటివరకు తన కళ్ళ ముందు జరగని సంఘటనలన్నీ జరుగుతున్నట్లుగా ఊహించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో నితిన్ అనే పిల్లాడు.. 30 ఏళ్ళ క్రితం జరిగిన ఓ మర్డర్ కేసును మొత్తం ఓ స్కూల్ బుక్ లో రాస్తాడు. పోలీసులు దానిని ఇన్వెస్టిగేట్ చేయగా.. ఆ మర్డర్ నిజంగానే జరిగినట్లు తెలుస్తుంది. ఆ మర్డర్ మ్యాటర్ నిజం అవ్వడంతో.. ఆ కుర్రాడి తల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు నితిన్ కు ఈ హత్య గురించి ఎలా తెలుసు? 30 ఏళ్ళ క్రింద జరిగిన మర్డర్ కేసు ఏమై ఉంటుంది ? జాన్ దీనిని సాల్వ్ చేశాడా లేదా ? తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.