Swetha
ఒకే రోజు థియేటర్ లో రిలీజ్ అయినా మూడు సినిమాలకు.. ఒకటే OTT పార్ట్నర్. ఇప్పటివరకు ఇలా ఏ సినిమాలకు జరగలేదేమో. రీసెంట్ గా తెలుగు హిందీ తమిళ్ లో ఒకే రోజు థియేటర్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో వాటి OTT పార్ట్నర్ ఎదో చూసేద్దాం.
ఒకే రోజు థియేటర్ లో రిలీజ్ అయినా మూడు సినిమాలకు.. ఒకటే OTT పార్ట్నర్. ఇప్పటివరకు ఇలా ఏ సినిమాలకు జరగలేదేమో. రీసెంట్ గా తెలుగు హిందీ తమిళ్ లో ఒకే రోజు థియేటర్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో వాటి OTT పార్ట్నర్ ఎదో చూసేద్దాం.
Swetha
తెలుగు నుంచి హిట్ 3 , తమిళ్ నుంచి రిట్రో , హిందీ నుంచి రైడ్ 2 సినిమాలు ఒకే రోజు థియేటర్ లో సందడి చేసాయి. ఈ మూడు సినిమాలకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. కలెక్షన్స్ పరంగా కూడా మూడు సినిమాలు పర్లేదు అనిపించుకున్నాయి. సాదరంగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఏ OTT లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మూడు సినిమాల OTT రైట్స్ ఒకటే ప్లాట్ ఫార్మ్ దక్కించుకోవడం విశేషం.
ఈ మూడు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు.. థియేట్రికల్ రన్ ని బట్టి OTT స్ట్రీమింగ్ కు వస్తూ ఉంటాయో. పైగా ఇప్పుడు ఈ సినిమాలకు థియేటర్ లో బాగానే క్రేజ్ ఉంది కాబట్టి.. ఆరు వారాల తర్వాత OTT ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మే నెల చివరి నుంచి జూన్ రెండు, మూడు వారాల్లోపు ఈ మూడు సినిమాలు OTT స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. ఇక మూడు సినిమాలు ఒకే రోజు OTT లోకి వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీ… ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసింది. ఇక తమిళ మూవీ రెట్రో తెలుగులో అంతంత మాత్రంగానే ఉన్నా.. తమిళ్ లో కలెక్షన్స్ అదరగొడుతుంది. ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా రాబట్టింది. ఇక అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’ మూవీ కూడా బాలీవుడ్ లో దుమ్మురేపుతోంది. ఈ మూవీ కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. సో థియేట్రికల్ రన్ ని బేస్ చేసుకుని ఈ సినిమాలు OTT ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.