Gangs Of Godavari OTT: విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి రాబోయేది ఆ OTT లోకే ..

సినిమాలు ఇలా థియేటర్ లోకి రావడం అలా వాటి ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోవడం అన్ని చక చక జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రిలీజ్ అయినా ఓ సినిమా అప్పుడే ఏ ఓటీటీ లోకి రానుందో టాక్ వినిపించేస్తుంది. మరి ఇంతకీ ఇవి ఏ సినిమానో చూసేద్దాం.

సినిమాలు ఇలా థియేటర్ లోకి రావడం అలా వాటి ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోవడం అన్ని చక చక జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రిలీజ్ అయినా ఓ సినిమా అప్పుడే ఏ ఓటీటీ లోకి రానుందో టాక్ వినిపించేస్తుంది. మరి ఇంతకీ ఇవి ఏ సినిమానో చూసేద్దాం.

ఒకప్పుడు థియేటర్ లో ఏ సినిమాలు ఎప్పడు రిలీజ్ అవుతున్నాయా అని అందరూ చూసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇంకాస్త అప్ డేట్ అయ్యి.. థియేటర్ లో రిలీజ్ అయిన రోజునే ఆయా సినిమాలు ఏ ఓటీటీ లో వస్తాయా అని సెర్చ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విశ్వక్ సేన్ నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇలా సినిమా రిలీజ్ అయిందో లేదో వెంటనే ఆ సినిమా ఓటీటీ గురించి డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి రానుందో చూసేద్దాం.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడని చెప్పి తీరాలి. జోనర్ ఏదైనా కానీ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా విశ్వక్ నటించిన సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమా టీజర్ దగ్గరనుంచి ట్రైలర్ రిలీజ్ వరకు అయితే అందరిని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాపై అందరికి భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు థియేటర్ లో మాత్రం ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయిపోయిందట. ఈ సినిమాను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఇన్సైడ్ టాక్. దాదాపు స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్ అయినట్లే. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు షాక్ ఇస్తూ .. త్వరగా ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి షాక్స్ ఇస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకు లిరిసిస్ట్ కృష్ణచైతన్య డైరెక్టర్ గా వ్యవహరించగా.. ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments