OTT లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ‘గోలీ సోడా రైజింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Crime Thriller Series - Goli Soda Rising OTT Streaming Date: ఓటీటీ లకు బాగా క్రేజ్ పెరిగిపోతుంది. వరుసగా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా రాబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

Crime Thriller Series - Goli Soda Rising OTT Streaming Date: ఓటీటీ లకు బాగా క్రేజ్ పెరిగిపోతుంది. వరుసగా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా రాబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ వారం ఓటీటీ లోకి ఏ ఏ సినిమాలు , సిరీస్ లు రానున్నాయనే విషయాన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక ఆ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరి కొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఇవి మాత్రమే కాకుండా ఈ నెలలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చాలానే సినిమాలు , సిరీస్ లు రెడీ అయిపోతున్నాయి. ఇక వీటిలో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కాబాట్టి.. మేకర్స్ కూడా ఆయా సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా రాబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ తో.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ఆల్రెడీ ఈ సిరీస్ గురించి వినే ఉంటారు. తమిళంలో భారీ హిట్ అందుకున్న గోలి సోడా మూవీ ఫ్రాంచైజీ నుంచి.. వస్తున్న మూడవ పార్ట్ గోలి సోడా రైజింగ్. విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేసిన గోలి సోడా మూవీ 2014 లో రిలీజ్ అయింది.. ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రావడంతో.. 2018లో గోలి సోడా 2 వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీలో మూడవ పార్ట్ ను తీసుకురానున్నారు. అయితే ఈసారి దీనిని సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక ఈ సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సిరీస్ ట్రైలర్ ను గమనిస్తే.. పోలీసులు , యూత్ గ్యాంగ్ , హత్యలు , యాక్షన్ సీన్స్ ఇలా అన్నిటిని కవర్ చేస్తూ.. హార్ట్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ లా ఉండబోతుందని అనిపిస్తుంది. కాగా ఈ సిరీస్ లో మ్, అభిరామి, పుగళ్, రమ్య నంబీషన్, అవంతికా మిశ్రా, చేరన్, ఆర్కే విజయ్ మురుగన్, భరత్ శ్రీని లాంటి వారు నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసురానున్నారు. తమిళం, తెలుగు కాకుండా కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలకు మంచి బజ్ ఉంది కాబట్టి.. ఈ సిరీస్ కూడా బాగానే సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments