కమిటీ కుర్రాళ్ళు మూవీ రాబోయేది ఆ OTT లోకే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Committee Kurrollu Movie OTT Platform: చిన్న సినిమాగా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. ఊహించని విధంగా సక్సెస్ సాధించిన సినిమాలలో లిస్ట్ లో ఇప్పుడు.. రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు మూవీ కూడా యాడ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Committee Kurrollu Movie OTT Platform: చిన్న సినిమాగా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. ఊహించని విధంగా సక్సెస్ సాధించిన సినిమాలలో లిస్ట్ లో ఇప్పుడు.. రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు మూవీ కూడా యాడ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిపోయింది. సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. సినిమాలు స్టార్ నటి నటులు ఉన్నారా లేదా అనే విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. ప్రేక్షకుల ఫోకస్ అంతా.. ఇప్పుడు వారి అభిరుచులకు తగిన కథ సినిమాలో ఉందా లేదా అనే దానిపైనే ఉంది. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయినా.. సినిమాలు ఇప్పుడు ఊహించని విధంగా సక్సెస్ అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు మూవీ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలను చూసేద్దాం.

పదకొండు మంది కొత్త హీరోలను.. ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మూవీ.. ‘కమిటీ కుర్రాళ్ళు’. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై డీసెంట్ హైప్ ను ఎలా అయితే క్రియేట్ చేశాయో.. ఆగస్ట్ 9 న థియేటర్ లో రిలీజ్ చేసిన తర్వాత కూడా.. మొదటి షో నుంచే హిట్ టాక్ ను సంపాదించుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా సరే ఇప్పుడు మూడో వారంలోను ఈ సినిమాకు హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి.. ఓటీటీ స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.

కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యధు వంశీ దర్శకత్వం వహించగా .. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, ప్రసాద్ బెహరా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. కథలో కంటెంట్ ఉంటే చాలని ఈ సినిమా తో మరొక్కసారి ప్రూవ్ అయింది. ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాలలో ఫీల్ గుడ్ నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఇంకా ఎలాంటి ప్రశంసలు అందుకుతుందో వేచి చూడాలి. ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో విడుదల నెల తర్వాత స్ట్రీమింగ్ కు రావాలి కాబట్టి.. ఈ మూవీ సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments