కమిటీ కుర్రాళ్ళు మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

Committee Kurrollu Movie OTT streaming Date :ఆగస్ట్ నెలలో రిలీజ్ అయినా అన్ని సినిమాలలో.. యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న మూవీ.. ఏదంటే అందరి నోటా వినిపించేది కమిటీ కుర్రాళ్ళు మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Committee Kurrollu Movie OTT streaming Date :ఆగస్ట్ నెలలో రిలీజ్ అయినా అన్ని సినిమాలలో.. యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న మూవీ.. ఏదంటే అందరి నోటా వినిపించేది కమిటీ కుర్రాళ్ళు మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కంటెంట్ ఉండే కథలకు స్టార్ క్యాస్టింగ్ , బడ్జెట్ తో అసలు సంబంధం లేదని మరొక సినిమా ప్రూవ్ చేసింది. అదే ఆగస్ట్ 9న థియేటర్ లో రిలీజ్ అయినా కమిటీ కుర్రాళ్ళు మూవీ. కొత్త దర్శకుడు , కొత్త నటి నటులు , నిహారిక కొణిదెల మొదటి సారి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం .. ఇలా మొదటి అటెంప్ట్ లోనే సక్సెస్ సాధించడం అనేది.. కేవలం ఇలా కంటెంట్ ఉండే సినిమాలకు మాత్రం సాధ్యం. అలాంటి మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించి.. యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుని.. మేకర్స్ కు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఓటీటీ పార్ట్నర్ అనౌన్స్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

యాక్షన్ సీన్స్ , రొమాన్స్ , వైలెంట్ సీన్స్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడతారు అనుకుంటే పొరపాటే. ఇలాంటివేమీ లేకుండా ప్రేక్షకుల మనసు దోచేలా వారికి వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా.. ఉండే కథలకు ఈ మధ్య ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అలాంటి పాయింట్ తోనే ఈ మూవీ వచ్చింది.. నోస్టాలజిక్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్ లో రన్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఎంచక్కా ఓటీటీ లో మిస్ కాకుండా చూసేయండి.

ఇక కమిటీ కుర్రాళ్ళు సినిమా కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో పన్నెండేళ్లకు ఒకసారి ఓ జాతరను జరుపుకుంటారు. అలానే ఓసారి సరిగ్గా జాతర సమయంలోనే ఎన్నికలు కూడా వస్తాయి. ఆ ఎన్నికలలో శివ అనే అతను సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ముందుకు వస్తాడు. అయితే అక్కడ కులాల గొడవలు కూడా ఎక్కువగా ఉండడంతో.. జాతర జరిగే వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. దానికి ముందు జాతరలో కొంతమంది స్నేహితులు కులాల కారణంగా విడిపోతారు. మరి ఈసారి జాతరలో.. ఆ స్నేహితులు మళ్ళీ కలుస్తారా లేదా ? శివ సర్పంచ్ గా గెలవడానికి ఎలాంటి ప్రచారం చేస్తాడు ? జాతర విషయంలో ఈసారి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? ఆ తర్వాత ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments