Keerthi
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సష్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఇంతకి ఎక్కడంటే..
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సష్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఇంతకి ఎక్కడంటే..
Keerthi
ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన ఏ సినిమాలైనా నెల రోజులకే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అందువలన ప్రేక్షకులు కూడా ఇన్నాళ్లులా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాటానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఎందుకంటే.. వారం వారం ఓటీటీలో వివిధ జోనర్ లోని సినిమాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకులు కూడా ఓటీటీ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఇంట్రెస్టీంగ్ సష్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమా త్వరలో ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో శివకందుకూరి హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేశారు మేకర్స్. ఇక అందుకోసం మొదటగా అనుకున్న తేదీ ప్రకారమే ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇంతకి ఎక్కడంటే..
శివ కందకూరి హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారయణ’. ఈ సినిమాను ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా దర్శకుడు పురుషోత్తమ్ రాజ్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్ గా రాశీసింగ్ నటించింది. ఇక ఈ చిత్రంను ఈనెల అనగా మార్చి 1వ తేదీన విడుదలైంది. ఇక ఈ డిటెక్టివ్ బ్యాక్ డ్రాప్ లో విడుదలైన ఏ సినిమా అయిన మంచి హిట్ కొట్టాల్సిందే. ఇప్పటికే ఈ తరహా సినిమాలు విడుదలై మంచి హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసింది. అయితే ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారయణ సినిమా కూడా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓ మోస్తరుగా వసూళ్లను కూడా రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ సినిమాను ఆహా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. అయితే మొదటి నుంచి ఈ సినిమాను ఈనెల అనగా మార్చి 22న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తునే ఉన్నా.. దానిపై అధికారక ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా అనుకున్న తేదీ ప్రకారమే.. నేడు అనగా శుక్రవారం (మార్చి 22న) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందానని ఎదురుచూసిన మూవీ లవర్స్ అలస్యం చేయకుండా వెంటనే ఆహాలో చూసేయండి. ఇక భూతద్ధం భాస్కర్ నారాయణలో దేవిప్రసాద్, అరుణ్, షఫీ, శివన్నారాయణ తదితర నటులు కీలక పాత్రలు పోషించారు.
ఇక భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విషయానికొస్తే.. దిష్టిబొమ్మల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. చాలామంది మహిళల్ని హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు. ఇలా 17 మంది అమ్మాయిలు చనిపోయిన ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోతారు. ఈ క్రమంలోనే.. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దిష్టి బొమ్మల హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. అప్పుడే ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు?నర బలుల పేరుతో అమ్మాయిలను ఆ కిల్లర్ హతమార్చడానికి కారణం ఏమిటి? కిల్లర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో లక్ష్మి (రాశీ సింగ్) అనే జర్నలిస్ట్ భాస్కర్ నారాయణకు ఎలా అండగా నిలిచింది? అన్నదే భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ కథ. మరి, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.