Bhaje Vaayu Vegam OTT: అఫీషియల్: భజే వాయువేగం OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

దాదాపు ఇప్పుడు సినిమాలన్నీ కూడా థియేటర్ లోకి వచ్చిన నెల రోజుల్లోపే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో లేటెస్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

దాదాపు ఇప్పుడు సినిమాలన్నీ కూడా థియేటర్ లోకి వచ్చిన నెల రోజుల్లోపే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో లేటెస్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

గత రెండు వారాలుగా చూసినట్లయితే .. ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలలో కనీసం ఒక్క సినిమా అయినా.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా ఉంటుంది. ఇక ఈ నెలలో ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. అటు రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలలోనూ కేవలం ఒక్క సినిమా మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఈ వారం ఈ సినిమా కూడా ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయువేగం. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి హిట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి బజ్ నడుస్తుంది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లోకి రాబోతుందో.. ఎప్పుడు రాబోతుందో చూసేద్దాం.

భజే వాయు వేగం సినిమా మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదట ఈ సినిమా గురించి స్లో ఓపెనింగ్స్ వచ్చినా కానీ.. పాజిటివ్ టాక్ రాయడంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినట్లే. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లో ఈ సినిమాను చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. అందులోను ఈ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేశాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ క్రికెటర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. మంచి ఇల్లు కుటుంబం అంతా బాగానే ఉన్నా కూడా.. అకస్మాత్తుగా పెరిగిన అప్పుల భాధ వలన.. అతని తల్లి దండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దీనితో ఒక్కసారిగా అతని జీవితం అంతా తారుమారు అవుతుంది. దీనితో అతని తండ్రి స్నేహితుని కుటుంబం ఇతనిని ఆదుకుంటుంది. అప్పటికే వారి ఇంట్లో ఓ కొడుకు ఉంటాడు, దీనితో ఇద్దరినీ సమానంగానే పెంచుతారు ఆ ఫ్యామిలీ. కట్ చేస్తే మరొక సీన్ లో హైదరాబాద్ మేయర్ కొడుకుతో.. ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఓ గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఓ రోజు ఆ మేయర్ కొడుకు శవం తన తమ్ముడి కార్ లో దొరుకుతుంది. ఇక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. హీరో కు ఆ హత్యకు ఎమన్నా సంబంధం ఉందా ! అసలు మేయర్ కొడుకు ఎలా చనిపోయాడు ! ఈ హత్య కేసు నుంచి బయట పడ్డారా లేదా ! అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments