Buddy OTT: అఫీషియల్: OTTలోకి అల్లు శిరీష్ బడ్డీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Buddy OTT Release & Streaming Platform: అల్లు శిరీష్- గాయత్ర భరద్వాజ్ జంట వచ్చిన బడ్డీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Buddy OTT Release & Streaming Platform: అల్లు శిరీష్- గాయత్ర భరద్వాజ్ జంట వచ్చిన బడ్డీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత మల్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బడ్డీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిచాడు. అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. హీరోగా అల్లు శిరీష్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా ఒక వైవిధ్యభరితమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటూ మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఇంక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూపులు చేస్తున్నారు. ఆ టైమ్ రానే వచ్చింది. బడ్డీ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

బడ్డీ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 30న అల్లు శిరీష్ బడ్డీ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ డివైడ్ అయినా కూడా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది అంటున్నారు. ఎందుకంటే చాలా సినిమాలు థియేటర్లలో అటు ఇటుగా ఆడినా.. ఓటీటీల్లో మాత్రం దూసుకుపోతూ ఉంటాయి. అందుకే బడ్డీ చిత్రం కూడా ఓటీటీలో సత్తా చాటుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

బడ్డీ కథ ఇదే:

ఆదిత్య(అల్లు శిరీష్) ఒక పైలట్. పల్లవి(గాయత్రీ భరద్వాజ్) కంట్రోల్ రూమ్ లో పనిచేస్తూ ఉంటుంది. పైలట్ గా విధుల్లో ఉన్న సమయంలో ఆదిత్య తరచూ కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూ ఉండాలి. ఆ సమయంలోనే పల్లవి పరిచయం అవుతుంది. ఒకరిని ఒకరు చూడకుండానే ఇష్టపడతారు. అయితే పల్లవి వల్ల ఆదిత్య ఉద్యోగం పోతుంది. కలిసి సారీ చెప్తాం అనుకున్న సమయంలో పల్లవిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ సమయంలోనే పల్లవి బతికుండగానే ఆమె ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి వెళ్తుంది. అసలు పల్లవిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆమె ఆత్మగా ఎలా మారింది? తిరిగి తన శరీరాన్ని పొందిందా లేదా? అనేదే బడ్డీ కథ. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే కచ్చితంగా నచ్చుతుంది. మరి.. బడ్డీ సినిమా కోసం మీరూ వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments