నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఈ మూవీస్.. ఏ OTTల్లో ఉన్నాయంటే!

National Film Award Movie In OTT: నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. సినిమా రంగంలో ఈ అవార్డ్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజాగా 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఆయా సినిమాలు ఏ ఓటీటీ లో ఉన్నాయనే విషయాలు చూసేద్దాం.

National Film Award Movie In OTT: నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. సినిమా రంగంలో ఈ అవార్డ్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజాగా 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఆయా సినిమాలు ఏ ఓటీటీ లో ఉన్నాయనే విషయాలు చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీటీ లకు ఏ రేంజ్ లో ఆదరణ పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము. అయితే థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలను త్వరలో ఓటీటీ లలోకి రావడం గురించి.. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఏకంగా.. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను గెలుచుకున్న చిత్రాలు ఏ ఓటీటీ లో ఉన్నాయో కూడా సెర్చ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాకగా ఈ ఏడాది 70వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను తాజాగా అనౌన్స్ చేశారు. వీటిలో కేవలం తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఈసారి.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మిగిలినవన్నీ కూడా మలయాళ , తమిళ సినిమాలే. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • ఆట్టమ్: ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్ దక్కింది. ప్రస్తుతం ఆట్టమ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
  • కాంతార: రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మూవీ ఇది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
  • తిరు: జాతీయ ఉత్తమ నటిగా నిత్యా మీనన్ ను అవార్డ్ తెచ్చిపెట్టిన ఈ సినిమా.. సన్ నెక్స్ట్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
  • కచ్ ఎక్స్‌ప్రెస్: ఉత్తమ నటిగా మానసి పరేఖ్ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఈ మూవీ.. షిమారో అనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • కార్తికేయ 2: ఈ సినిమా గురించి అందరికి తెలిసిందే. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఎంపికైన ఈ మూవీ జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • పొన్నియిన్ సెల్వన్-1: అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది
  • బ్రహ్మస్త్ర : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • సౌది వెళ్లక్క సీసీ 225య/2009 : ఈ మలయాళ మూవీ సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది.
  • వాల్వీ : ఈ మరాఠి మూవీ అమెజాన్ ప్రైమ్ , జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • మలికాపురమ్ : బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీపాథ్ కు అవార్డు తెచ్చిపెట్టిన ఈ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • కేజీఎఫ్ 2: బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరిలో ఎంపికైన ఈ మూవీ .. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • అపరాజితో : బెస్ట్ మేకప్ , ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ఎంపికైన ఈ బెంగాలీ మూవీ.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • కబేరి అంతర్జాన్ : ఈ బెంగాలీ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.
  • గుల్ మోహర్ : ఈ హిందీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • ఊంచాయ్ : ఈ మూవీ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
  • ఆడుజీవితం: ఈ మధ్య కాలంలో అటు థియేటర్స్ ను, ఇటు ఓటీటీ ని ఒక ఊపు ఊపేస్తున్న మూవీ.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ , బెస్ట్ డైరెక్టర్ విభాగంతో సహా చాలా అవార్డ్స్ ను దక్కించుకుంది.

మరి ఈ సినిమాలను కనుక ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments