Tirupathi Rao
OTT Movie Suggestions: టాలీవుడ్ ప్రేక్షకులకు రాధికా అక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో రాధికా అక్క సీనియర్ ఉంది చూశారా?
OTT Movie Suggestions: టాలీవుడ్ ప్రేక్షకులకు రాధికా అక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో రాధికా అక్క సీనియర్ ఉంది చూశారా?
Tirupathi Rao
థియేటర్ గానీ.. ఓటీటీ గానీ కొన్ని సినిమాల్లో ఉండే పాత్రలు మన మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ క్యారెక్టర్స్ మనకి గుర్తుండిపోతాయి. ఆ పాత్రల మీద మీమ్స్ రావడం, వాటి రిఫరెన్సులను రియల్ లైఫ్ లో కూడా వాడటం చేస్తుంటాం. అలా ఇటీవలి కాలంలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే రాధికా అనే చెప్పాలి. డీజే టిల్లు మూవీలో ఉన్న హీరోయిన్ పాత్ర రాధిక యువతలో చెరగని ముద్ర వేసింది. తాజాగా టిల్లు స్క్వేర్ కూడా వస్తుండటంతో ఆ పేరు మరింత వైరల్ అయ్యింది. అయితే బాలీవుడ్ లో కూడా ఒక రాధికా లాంటి క్యారెక్టర్ ఉందని మీకు తెలుసా? ఆ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్టు కొట్టింది.
ఇప్పుడు చెప్పుకుంటోంది గోవిందా నామ్ మేరా అనే బాలీవుడ్ మూవీ గురించి. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. భాష రాకపోయినా కూడా ఈ మూవీని అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ మూవీలో కావాల్సినన్ని ట్విస్టులు ఉంటాయి. భార్యా బాధితుడిగా విక్కీ కౌశల్ ఎంతో బాగా నటించాడు. అలాగే టార్చర్ పెట్టే భార్యగా భూమి పెడ్నేకర్ అద్భుతంగా నటిస్తుంది. ఇంక ప్రియురాలు సుకు దేశ్ ముఖ్ లాగా కియారా యాక్టింగ్ ఇరగదీస్తుంది. ఇందులో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి.
సినిమా మొత్తం ఒక సాధారణ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది. కానీ, తర్వాత తర్వాత రివేంజ్, చీటింగ్, థ్రిల్లర్ మూవీలా మారిపోతుంది. ఫస్టాఫ్ లో కాస్త ల్యాగ్ అనిపించినా కూడా.. అసలు కథ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం స్టోరీ పరుగులు పెడుతుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్, కియారా, భూమి పెడ్నేకర్ నటన మెప్పిస్తుంది. ఎవరికి వాళ్లు తమ ప్లానే వర్కౌట్ అవుతోంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు కథ వేరే ఉంటుంది. రాధికా అక్కలా మాత్రం కియారా అధ్వానీ కట్టి పడేస్తుంది. సినిమా క్లైమ్యాక్స్ లో హీరో గోవింద్ అన్నీ ట్విస్టులు రివీల్ చేస్తూ ఉంటే పాత్రలకు మాత్రమే కాదు.. ఆడియన్స్ కు కూడా మబ్బులు విడిపోతూ ఉంటాయి.
గోవింద్(విక్కీ కౌశల్) ఒక బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్ కావాలి అని కలలు కంటూ ఉంటాడు. అతనికి గౌరీతో వివాహం జరుగుతుంది(భూమి పెడ్నేకర్). కానీ, గోవింద్ కు ఎలాంటి సంపాదన లేదని గౌరి రెస్పెక్ట్ ఇవ్వదు. ఎలాగైనా గౌరికి విడాకులు ఇచ్చేసి సుక్కు(కియారా)ని వివాహం చేసుకోవాలి అని గోవింద్ చూస్తుంటాడు. అందుకు భూమి రూ.2 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తానంటూ షరతు పెడుతుంది. వాస్తవానికి గోవింద్ కు ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. కానీ, ఇతను సవతి కొడుకు అని మొదటి భార్య కుమారుడు కోర్టులో కేసు వేస్తాడు. ఆ బంగ్లా కాస్తా కొన్నేళ్లుగా కోర్టులోనే ఉంటుంది. ఇలా గోవింద్ కు అటు భార్య నుంచి, ఇటు స్టెప్ బ్రదర్ నుంచి పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటికి అదనంగా మరో కేసులో ఇరుక్కుంటాడు. చివరకు భార్యను హత్య కూడా చేసేందుకు రెడీ అయిపోతాడు. ఇలా మూవీలో చాలానే ట్విస్టులు ఉంటాయి. క్లైమ్యాక్స్ మాత్రం అదిరిపోతుంది. మరి గోవిందా నామ్ మేరా మూవీ మీరు చూశారా? మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.