థియేటర్ లో ప్లాప్ కానీ OTTలో ట్రెండింగ్… దీన్ని కానీ మిస్ అయ్యారా !

కొన్ని సినిమాలు థియేటర్ లో అంతంతమాత్రంగా అనిపించుకుంటాయి. కానీ OTTలో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొన్ని సినిమాలు థియేటర్ లో అంతంతమాత్రంగా అనిపించుకుంటాయి. కానీ OTTలో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

అదేంటో తెలియదు కానీ కొన్ని సినిమాలు థియేటర్లోకంటే OTT లోనే ఎక్కువ పేరు సంపాదించుకుంటాయి. అప్పుడు చూసేది ఇప్పుడు చూసేది అదే ఆడియన్స్ అయినా కూడా థియేటర్లో మాత్రం ఆ సినిమాలు డిజాస్టర్ టాక్ సంపాదించుకుంటాయి. అలాంటి వాటిలో సిద్ధూ జొన్నలగడ్డ , వైష్ణవి చైతన్య నటించిన సినిమా జాక్ కూడా ఒకటి. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డకు హీరోగా మంచి క్రేజ్ లభించింది. పైగా అటు వైష్ణవి చైతన్య కు కూడా బేబీతో మంచి ఫేమ్ దక్కింది. దీనితో ఈ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడు.. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు కాస్త తారుమారు అయ్యాయి. మొదటి షో నుంచి మిక్సెడ్ టాక్ తో మొదలయ్యి.. రాను రాను ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ లో అంతగా సందడి చేయలేకపోయింది జాక్.

ఇక ఆ తర్వాత ఈ సినిమాను OTT లో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో డిజాస్టర్ అయింది కాబట్టి OTT నుంచి మంచి టాక్ వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ అనుకోని విధంగా ఇప్పుడు ఈ సినిమా OTTలో ట్రెండ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో టాప్ 2లో ఉంది జాక్ సినిమా. OTT ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాయ చేసిందో తెలియదు కానీ మొత్తానికి డిజాస్టర్ టాక్ ను కాస్త తుడిచిపెట్టేసింది. కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో ఎవరైనా మిస్ అయితే కనుక వెంటనే OTT లో ఓ లుక్ వేసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments