Tirupathi Rao
Great Suspense Thriller In OTT: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది.
Great Suspense Thriller In OTT: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది.
Tirupathi Rao
సినిమాని ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. కానీ, అందరికీ అన్నీ సినిమాలు నచ్చాల్సిన అవసరం లేదు. కొందరు యాక్షన్ సినిమాలు చూస్తారు, ఇంకొందరు ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడతారు. మరికొందరు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు అంటే పడి చచ్చిపోతారు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అలాంటి వారికోసం ఇప్పుటు ఓటీటీలో అదిరిపోయే సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీలో ట్విస్టులు, యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ ఉన్నాయి. మీరు గనుక ఈ సినిమాని ఇప్పటివరకు చూడకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి చూడాల్సిన సినిమా ఇది.
మనం చెప్పుకుంటోంది శరత్ కుమార్- అమితాష్ ప్రధాన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన పరంపోరుల్ చిత్రం గురించి. ఈ మూవీ తమిళ్ లో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తమిళ్ వర్షన్ ఆహా తమిళ్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఇటీవల ఈటీవీ విన్ యాప్ లోకి ఈ సినిమా తెలుగు వర్షన్ తీసుకున్నారు. తెలుగులో విడుదలైనప్పటి నుంచి ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని చాలా రోజుల నుంచి మిస్ అయ్యాం అనే భావన కలుగుతుంది. మలయాళం, తమిళ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ సినిమాల్లో డ్రామా కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఈ మూవీలో డ్రామాతో పాటుగా, యాక్షన్, ట్విస్టులు కూడా గట్టిగానే ఉంటాయి. ఈ మూవీలో శరత్ కుమార్ ఒక బ్యాడ్ కాప్ గా నటించాడు. లంచాలు, అక్రమ సంపాదన కోసం పాకులాడే ఒక పోలీసు అధికారిగా శరత్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. ఇంక, అమితాష్ ప్రధాన్ నటన అందరినీ మెప్పిస్తుంది. అతని పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే అది క్లయిమ్యాక్స్ వరకు రివీల్ కాదు. అలాంటి ట్విస్టులు ఈ సినిమాలో చాలానే ప్లాన్ చేశారు. మీరు గనుక ఈ మూవీని ఇంకా చూడకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా చూసేయచ్చు. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూశామనే భావన తప్పకుండా కలుగుతుంది.
ఈ సినిమా కథ మొత్తం విగ్రహాల మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. పురాతన విగ్రహాలు, విలువైన దేవుడి విగ్రహాలను స్మిగ్లింగ్ చేసే గ్యాంగులు, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఒక యాంటిక్ విగ్రహం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ మాఫియాలోకి, అమితాష్ ప్రధాన్ ఎలా వస్తాడు? అమితాష్ లైఫ్ లోకి కరప్టెడ్ పోలీస్ అయిన శరత్ కుమార్ ఎందుకు ఎంట్రీ ఇస్తాడు? అవినీతి పోలీసుతో చేతులు కలిపి తప్పుడు పనులు చేయడం కోసం హీరో ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు హీరో కుటుంబంలో ఉన్న కష్టాలేంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలి అంటే మీరు ఓటీటీలో అందుబాటులో ఉన్న పరంపోరుల్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. మరి.. పరంపోరుల్ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? చూడకపోతే చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.