Swetha
సినిమాలంటే ఇప్పుడు అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సినిమాలంటే ఇప్పుడు అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
సినిమాలు సిరీస్ లంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. రెండున్నర గంటల సేపు హాయిగా అన్ని సమస్యలు మర్చిపోయి.. ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా కంటే బెస్ట్ చాయిస్ ఇంకోటి ఉండదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులోను.. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడడం అంటే అందరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఓటీటీ లకు ఆదరణ బాగా లభిస్తోంది. ఇక వారం వారం ఓటీటీ లలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఓటీటీ లోకి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి చూసేద్దాం.
ఓటీటీ లోకి రాబోతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ పేరు.. “రణం”. ఈ సినిమాలో.. వైభవ్, నందితా శ్వేతా హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించారు. రణం అరమ్ థవరేల్ పేరుతో ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ముందుగా ఊహించినట్లుగానే.. కథ, కథనాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఐదు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. థియేటర్ లో దాదాపు పదిహేను కోట్ల వరకు వసూళ్లను సంపాదించింది. ఇక ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ తమిళ మిస్టరీ ఇప్పుడు తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని.. ప్రకటించారు మేకర్స్.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక స్కెచ్ ఆర్టిస్ట్.. ఇతను కొన్ని అంతుచిక్కని మర్డర్ మిస్టరీస్ ను సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు.. ఓ సిటీలో ఓకే మర్డర్ జరుగుతుంది, ఆ డెడ్ బాడీకి సంబంధించిన పార్ట్శ్ అన్ని కూడా మూడు ప్రదేశాలలో దొరుకుతాయి. తల మాత్రం మిస్ అవుతోంది. అచ్చం ఇలానే తలలు మిస్ అవుతూ వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు ! ఇందులో నందితా శ్వేతా పాత్ర ఏమిటి ! దీని వెనుక ఉన్న మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తారా లేదా! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే, మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.