Swetha
ఓటీటీ లోకి అమీజాక్సెన్ హీరోయిన్ గా నటించిన చాఫ్టర్-1 మూవీ వచ్చేసింది. మరి, ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటీటీ లోకి అమీజాక్సెన్ హీరోయిన్ గా నటించిన చాఫ్టర్-1 మూవీ వచ్చేసింది. మరి, ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
Swetha
అమీజాక్సెన్, అరుణ్ విజయ్ హీరో,హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ “మిషన్ చాప్టర్-1”. ఈ మూవీతో దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత అమీజాక్సన్ కోలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. అయితే, ఈ సినిమా కథ రొటీన్ గా ఉండడంతో.. ఆశించిన రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మిషన్ చాప్టర్-1 మూవీ. అయితే థియేటర్ లో ఈ సినిమా మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు విడుదలైన ఇన్ని రోజులకు మిషన్ చాప్టర్-1 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మరి, ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమీజాక్సన్ నటించిన మిషన్ చాప్టర్-1 మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తండ్రి కూతుళ్ళ అనుబందానికి యాక్షన్ సన్నివేశాలను జోడించి ఈ సినిమాను చిత్రీకరించారు మేకర్స్. ఇక ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో .. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ లో తమిళ వెర్షన్ తో పాటు.. తెలుగు వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం చేశారు. కానీ, ప్రస్తుతానికి మాత్రం కేవలం తమిళ వెర్షన్ ను మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కాగా, మిషన్ చాప్టర్-1 సినిమా కథ విషయానికొస్తే.. తండ్రి కూతుళ్ళ బాంధవ్యం మీద సాగే కథ ఇది. హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురును కలుసుకునేందుకు.. ఖైదీగా మారిన తండ్రి ఎలాంటి పోరాటం చేశాడు. అసలు అతను ఖైదీగా మారడానికి గల కారణం ఏమిటి, అనే అంశాలను యాక్షన్ సన్నివేశాలతో జోడించి.. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమీజాక్సెన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. అందరిని అలరించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, మిషన్ చాప్టర్-1 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.