Dharani
Oh My God 2: అక్షయ్ కుమార్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటి తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
Oh My God 2: అక్షయ్ కుమార్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటి తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
Dharani
ఓటీటీల పుణ్యామా అని.. భాషతో సంబంధం లేకుండా.. అన్ని లాంగ్వేజ్‌లలో మనకు నచ్చిన సినిమాలు చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ఓటీటీల్లో మూవీలు చూసే వాళ్లు పెరగడంతో.. మేకర్స్ కూడా వేరే భాషల్లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఇతర చిత్ర సీమల్లో బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచిన సినిమాలు.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈమధ్య కాలంలో వరుసగా మలయాళ సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజగా బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటి తెలుగు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు హీరో అక్షయ్‌కుమార్. అయితే గత కొన్నాళ్లుగా ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. కానీ గతేడాది ఆగస్ట్‌లో వచ్చిన ఓ మై గాడ్ 2 భారీ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. 200 వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న అక్షయ్ కెరీర్‌కు కాస్త ఊరట ఇచ్చింది. అంతేకాక గత ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా ఓ మై గాడ్ రికార్ట్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్ గురువారం నుంచి అనగా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇన్నాళ్లు మై గాడ్ 2 హిందీ వెర్షన్ మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. తాజాగా దక్షిణాది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఓ మై గాడ్ హిందీ వెర్షన్ గత ఏడాది అక్టోబర్‌లోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను మాత్రం తొమ్మిది నెలల తర్వాత విడుదల చేశారు.
ఓ మై గాడ్‌లో అక్షయ్‌కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ హీరోగా 2012లో రిలీజైన ఓ మై గాడ్ మూవీకి సీక్వెల్‌గా ఓ మై గాడ్ 2 వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పేరును శివుడి అని కాకుండా దేవదూతగా మార్చేశారు మేకర్స్. పైగా ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అనేక వివాదాలతో, అడ్డంకులు, వాయిదాలను దాటుకొని థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా హిట్టైంది.