ఆదికేశవ ఓటీటీ రిలీజ్‌.. ఎప్పుడు? ఎక్కడంటే..

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌తో మాస్‌ మసాలా కాన్సెప్ట్‌తో ఆది కేశవ తెరకెక్కింది. ఈ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయాలు...

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌తో మాస్‌ మసాలా కాన్సెప్ట్‌తో ఆది కేశవ తెరకెక్కింది. ఈ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయాలు...

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌- హీరోయిన్‌ శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా ‘ ఆదికేశవ’. ఎన్‌ శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచే కాక, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మాస్‌ మసాలా కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆదికేశవ మొదటి రోజు భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇక, ఈ చిత్రానికి సంబంధించి ముందుగానే ఓటీటీ ప్లాట్‌ ఫాం ముందుగానే ఫిక్స్‌ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఆదికేశవ ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

ఆదికేశవ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌ మూడో వారం నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి స్ట్రీమింగ్‌ డేట్‌ కొంచెం అటు, ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో జోజు జార్జ్‌, సుమన్‌, సుదర్శన్‌, అపర్ణా దాస్‌, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ‘ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ’ సంగీతం అందించారు. సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్, ఫార్ట్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ‘ఆది కేశవ’ సినిమాను తెరకెక్కించారు.

సినిమా కథేంటంటే..

బాలు( వైష్ణవ్‌ తేజ్‌) చదువు పూర్తి చేసుకుని జులాయిలా తిరుగుతూ ఉంటాడు. అతడికి ఉద్యోగం చేయటం అంటే అస్సలు నచ్చదు. అందుకే స్నేహితుడితో కలిసి తిరుగుతూ ఉంటాడు. అయితే, తల్లి మాట కాదన లేక తప్పని సరి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేరతాడు. ఆ కంపెనీ సీఈబో చైత్ర(శ్రీలీల)తో లవ్‌ యాట్‌ ఫస్ట్‌ సైట్‌ అవుతుంది. అతడు చైత్రకు తన ప్రేమ విషయం చెప్పేలోపే.. అతడికి ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. తర్వాతి కథ రాయలసీమలోని బ్రహ్మ సముద్రం అనే ఊరు చుట్టూ తిరుగుతుంది.

చెంగారెడ్డి అనే వ్యక్తి మైనింగ్‌ పేరుతో బ్రహ్మ సముద్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. కొండను తవ్వతూ శివాలయం వరకు వస్తాడు. మైనింగ్‌కు అడ్డుగా ఉందని గుడిని సైతం కూల్చాలని చూస్తాడు. ఇక్కడికి బాలు వస్తాడు. చెంగారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. బాలు ఎందుకు బ్రహ్మ సముద్రం వచ్చాడు? అతడికి తెలిసిన షాకింగ్‌ విషయం ఎంటి? బాలు చెంగారెడ్డిని అడ్డుకుంటాడా? తన ప్రేమ విషయం చైత్రకు చెబుతాడా? చివరికి ఎమైంది? అన్నదే మిగిలిన కథ.

Show comments