OTT Release: సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఈ వారం OTTల్లోకి ఏకంగా 29 సినిమాలు విడుదల

నేటి కాలంలో ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. అలానే ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల వివరాలు..

నేటి కాలంలో ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. అలానే ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల వివరాలు..

ఓటీటీల రాక తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. ఇంతకు ముందు కేవలం మాతృ భాష లేదంటే హిందీ, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూసే అవకాశం ఉండేది. కానీ మొబైల్స్ వచ్చాక.. ప్రపంచం ఎలా అయితే అర చేతిలోకి వచ్చిందో.. అలానే ఓటీటీలు వచ్చాక సినిమా ప్రపంచం ప్రేక్షకులు అర చేతిలోకి వచ్చేసింది. సబ్ టైటిల్స్ ఆప్షన్ ఉండటంతో.. భాష సమస్య లేకుండా.. వేర్వేరు ఇండస్ట్రీల్లో వచ్చిన సినిమాలను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. ప్రస్తుతం వీటి క్రేజ్ ఎలా ఉందంటే.. కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లోకే వస్తున్నాయి. బడా బడా స్టార్లు కూడా ఓటీటీల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

నేటి కాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమాలు అన్ని నెల రోజుల వ్యవధిలో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. అలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ సంక్రాంతి సందడి ఉండనుంది. ఇందుకు తగ్గట్లే ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ వంటి పెద్ద చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. దాంతో ఆయా హీరోల అభిమానులు, మూవీ లవర్స్.. ఈ సినిమాల విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఈ వారంలో ఓటీటీలోకి కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి.

ఈ వారం ఓటీటీ సినిమాల స్ట్రీమింగ్ విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. వీటిలో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘కిల్లర్ సూప్’, ‘అజయ్ గాడు’ చిత్రాలతో పాటు ‘ద లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సిరీస్ మూడో సీజన్ లపై సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ వారం తెలుగుతో పాటు పాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు ఏవి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ (జనవరి 08 నుంచి 14 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  1. ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్) – జనవరి 08
  2. డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్) – జనవరి 09
  3. పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్) – జనవరి 09
  4. కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్) – జనవరి 10
  5. ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్) – జనవరి 10
  6. బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్) – జనవరి 11
  7. ఛాంపియన్ (ఇంగ్లీష్) – జనవరి 11
  8. డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్) – జనవరి 11
  9. కిల్లర్ సూప్ (హిందీ) – జనవరి 11
  10. మంత్ర సురుగణ (ఇండోనేసియన్) – జనవరి 11
  11. సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్) – జనవరి 11
  12. ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు) – జనవరి 12
  13. అడిరే (ఇంగ్లీష్) – జనవరి 12
  14. లిఫ్ట్ (ఇంగ్లీష్) – జనవరి 12
  15. లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్) – జనవరి 12
  16. డంబ్ మనీ (ఇంగ్లీష్) – జనవరి 13

అమెజాన్ ప్రైమ్

  1. 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్) – జనవరి 11
  2. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు) – జనవరి 11
  3. రోల్ ప్లే (ఇంగ్లీష్) – జనవరి 12

జీ5

  1. అజయ్ గాడు (తెలుగు) – జనవరి 12
  2. హాట్‌స్టార్
  3. ఎకో (ఇంగ్లీష్) – జనవరి 11
  4. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు) – జనవరి 12

సోనీ లివ్

  1. చేరన్స్ జర్నీ (తెలుగు) – జనవరి 12
  2. జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్) – జనవరి 10
  3. టెడ్ (ఇంగ్లీష్) – జనవరి 12
  4. ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10

బుక్ మై షో

  1. జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్) – జనవరి 09
  2. వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్) – జనవరి 09
Show comments