Wines shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. మళ్లీ మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి వరకు అంటే?

మద్యం ప్రియులకు అలర్ట్.. మళ్లీ మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి వరకు అంటే?

మద్యం ప్రియులకు మరోసారి షాక్. తెలంగాణలో మళ్లీ వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఒవైపు బీర్ల కొరత, మరోవైపు మద్యం షాపులు బంద్ కానుండడంతో మందుబాబుల నెత్తిన పిడుగుపడ్డట్లు అవుతోంది.

మద్యం ప్రియులకు మరోసారి షాక్. తెలంగాణలో మళ్లీ వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఒవైపు బీర్ల కొరత, మరోవైపు మద్యం షాపులు బంద్ కానుండడంతో మందుబాబుల నెత్తిన పిడుగుపడ్డట్లు అవుతోంది.

ఇటీవలి కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మద్యం తీసుకోవడం కామన్ అయిపోయింది. అసలు మద్యం లేకుండా పార్టీలను, ఫంక్షన్లను ఊహించుకోలేని పరిస్థితి దాపరించింది. బర్త్ డే ఫంక్షన్ అయినా, మ్యారేజ్ ఫంక్షన్ అయినా సరే మద్యం మస్ట్ గా ఉండాల్సిందే. కొంతమంది అయితే మద్యం లేకపోతే ఊపిరి ఆగిపోయనట్టుగా ఫీలవుతుంటారు. కాగా చుక్క పడందే పూట గడవని మద్యం ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. మళ్లీ మద్యం షాపులు మూతపడనున్నాయి. ఎండల వేడి నుంచి చిల్ అయ్యేందుకు చల్లని బీర్లు తాగుదామనుకునే మందుబాబులకు బ్యాడ్ న్యూస్. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా వైన్స్ షాపులు మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల పలుమార్లు మద్యం షాపులు మూతపడుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు, ఇతర కారణాలతో వైన్ షాపులు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో మరోసారి మద్యం ప్రియులకు షాకిస్తూ వైన్స్ బంద్ కానున్నాయి. ఇటీవల తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 04న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, అల్లర్లు, గొడవలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో జూన్ 04న వైన్స్ షాపులు బంద్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 5వ తేదీన తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 04న వెలువడనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏపీలో కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు.

Show comments