iDreamPost
android-app
ios-app

తమన్నా స్థానంలో రంగమ్మత్త గెలిచేనా

  • Published Oct 07, 2021 | 11:10 AM Updated Updated Oct 07, 2021 | 11:10 AM
  • Published Oct 07, 2021 | 11:10 AMUpdated Oct 07, 2021 | 11:10 AM
తమన్నా స్థానంలో రంగమ్మత్త గెలిచేనా

ఆ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులుతో పాటుగా మొదలైన తమన్నా మాస్టర్ చెఫ్ కు ఆశించిన స్పందన రావడం లేదు. భారీగా ఖర్చు పెట్టిన జెమిని ఛానల్ కు కనీసం 2 టిఆర్పి రేటింగ్ కూడా రాకపోవడం షాక్ కలిగించేదే. దీనికి కారణాలు బోలెడు. మిర్చి బజ్జీ నుంచి మొఘలాయి వంటకాల దాకా ప్రతి ఒక్కటి యుట్యూబ్ లో ఈజీగా దొరుకుతున్న ట్రెండ్ లో అదే పనిగా రియాలిటీ షోలో వెరైటీ వంటకాల మీద జనం ఎంతమేరకు ఆసక్తి చూపిస్తారన్నది అనుమానమే. ఇప్పుడు ఆ డౌటే నిజమయ్యింది. దానికి తోడు తమన్నా స్వంత డబ్బింగ్ అంతగా సెట్ కాలేదనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీని వల్ల నేటివిటీ ఫీలింగ్ తగ్గిందని కొందరు అభిప్రాయపడ్డారు.

మరోపక్క ఇదే షో తమిళ్ లో విజయ్ సేతుపతి యాంకర్ గా బాగానే నడుస్తోంది. ఇక్కడంతా పూర్ రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇప్పుడు జెమిని డ్యామేజ్ రిపేర్ లో పడిందని మీడియా టాక్. తమన్నా స్థానంలో యాంకర్ అనసూయను రీప్లేస్ చేయబోతున్నారని దాని సారాంశం. బెంగళూరులో షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట. అదేం లేదు ఎఫ్3తో పాటు వివిధ షూటింగులకు డేట్లు ఇచ్చిన తమన్నా ఇప్పుడు మాస్టర్ చెఫ్ ని కొనసాగించే వీలు చిక్కకపోవడంతో తాత్కాలికంగా ఈ మార్పు అని మరో వెర్షన్ వినిపిస్తోంది కానీ ఒకవేళ అనసూయ కనక నిజంగానే ఈ షో రేటింగ్ ని నిలబెట్టగలిగితే అదో ఘనతగానే చెప్పుకోవచ్చు. ఏమో చూడాలి మరి.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే సినిమా స్టార్లు ఉన్నంత మాత్రమే రియాలిటీ షోలు పండవు. జనాన్ని మెప్పించే అంశాలు ఉండాలి. అంతటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎవరు మీలో కోటీశ్వరులుకు కనివిని ఎరుగని రేటింగ్ తేవడం లేదు. కాకపోతే బిగ్ బాస్ కన్నా మెరుగ్గా అనిపిస్తున్నాడు అంతే. జ్ఞానాన్ని పంచే కంటెంట్ కాబట్టి ఫ్యామిలీలు దీన్ని చూస్తున్నాయి. మరి పైన చెప్పినట్టు కొంత కాలం అయ్యాక తమన్నా కొనసాగితే ఓకే అనుకోవచ్చు. లేదూ అనసూయ కంటిన్యూ అయితే మాత్రం ఆలోచించాల్సిన మ్యాటరే. ఏది ఏమైనా ఒక షోని డిజైన్ చేస్తున్నప్పుడు ట్రెండ్ ని ఫాలో కావడం చాలా అవసరమని ఇటీవలి షోలు రుజువు చేస్తున్నాయి

Also Read : మహేష్ తర్వాత మరో స్పెషల్ సెలబ్రిటీ

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet