iDreamPost
iDreamPost
అగ్నిపథ్ పథకం మీద రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్మీ మాజీ సైనికాధికారుల దృష్టిలో అగ్నిపథ్ అంటే కుర్రాళ్లకు ఉద్యోగాలను ఎరవేయడం. అందులో 25శాతం మందినే శాశ్వతంగా తీసుకోవడమంటే మిగిలిన 75 శాతంమందిని ఇంటికిపంపినట్లే కదా! నిజానికి రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ జరగడంలేదు. అంటే 1.30 లక్షల మందిని ఇప్పటికే సైన్యంలో రిక్రూట్ చేసుకోవాలి. అంటే మొత్తం సైన్యంలో పది శాతం మేర కోతపడినట్లే. ఖాళీలను భర్తిచేయడంలేదంటే ఆమేరకు కుదించినట్లే కదా!
యేడాదికి 45వేల మంది చొప్పున అగ్నివీర్స్ ను రిక్రూట్ చేసుకొంటే వాళ్లలో మూడింతలను నాలుగేళ్ల తర్వాత ఇంటికి పంపితే ఖాళీలు పెరుతాయి తప్ప, తగ్గవు. ఎందుకంటే సాధారణంగా ఆర్మీ ప్రతియేడూ 60వేల మంది వరకు రిక్రూట్ చేసుకొంటుంది. దానికి బదులు 45వేల మందిని తీసుకొంటున్నారుకాని, అందులో 25శాతం మాత్రమే సైన్యంలో మిగులుతారు. అంటే 60వేలకు బదులు 12వేల మందే రిక్రూట్ అవుతారు. ఈ లెక్కన 2030 నాటికి సైన్యంలో 25శాతం మేర సైనికులు తగ్గుతారు.
ఇది ప్రభుత్వం కావాలనే అమలు చేస్తున్న వ్యూహం. చైనా, అమెరికాలాంటి దేశాలన్నీ సైన్యాన్ని ఆధునీకరిస్తున్నాయి. తక్కువ సైన్యం ఎక్కువ సమర్ధ అన్న వ్యూహాన్నిఅమలు చేస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషయల్ దే. అందుకే సైన్యపు జీతాలు, పెన్షన్ల ఖర్చును తగ్గించుకొని ఆధునీకరణవైపు మళ్లిస్తున్నాయి. ఇప్పుడు ఖర్చుపెట్టాల్సింది డ్రోన్లు, మిస్సైళ్లు, లాంగ్ రేంజ్ ఆర్టిలరి మీద. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేర్పిస్తున్న పాఠం ఇదేగా.