Periods: పీరియడ్స్‌లో ఉన్న మహిళలు పూజలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

పీరియడ్స్‌లో ఉన్న మహిళలు పూజలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Periods: భారత దేశంలో హిందువులు పూర్వ కాలం నుంచి సనాతన ధర్మయాలు, సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. మహిళల పీరియడ్స్ సమయంలో పలు నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి.

Periods: భారత దేశంలో హిందువులు పూర్వ కాలం నుంచి సనాతన ధర్మయాలు, సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. మహిళల పీరియడ్స్ సమయంలో పలు నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి.

భారత దేశంలో పూర్వ కాలం నుంచి హిందువులు హిందూ సంప్రదాయాలు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పుడు దేశం ఆధునికత వైపు దూసుకు పోతుంది..మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మహిళలకు కట్టుబాట్లు ఇంకా కఠినంగా కొనసాగుతున్నాయి. స్త్రీలలో పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. పురాతన కాలం నుంచి ఈ పీరియడ్స్ పై అనేక నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. హిందూమతంలో రుతు క్రమ సమయంలో మహిళలు దేవాలయాలకు వెళ్లకూడదు.. పూజల్లో పాల్గొనకూడదు అనే ఆచారం కొనసాగుతుంది. అయితే దీని వెనుక ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

మహిళలకు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. అయితే హిందూ మతంలో పీరియడ్స్ విషయంలో అనాధిగా కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు కొనసాగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో మహిళలు గుడికి వెళ్లకూడదు, పూజలో పాల్గొనకూడదు, తులసి చెట్టుకు నీరు పోయకూడదు.. పవిత్ర నదుల్లో స్నానం చేయకూడదు ఇలా పలు రకాల కట్టుబాట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పీరియడ్స్ విషయంలో ఉండే కట్టుబాట్లు చూసి అమ్మాయిలు మానసికంగా బాధపడుతున్నారు. అయితే అసలు పీరియడ్స్ టైమ్ లో స్త్రీలు పూజలు, గుడికి ఎందుకు వెళ్లకూడదు అన్న విషయంలో శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. పీరియడ్స్ సమయంలో స్త్రీ శరీరంలో చాలా హార్మోన్లు మారుతుంటాయి. దీని వల్ల చిరాకు పడటం, కోపగించుకోవడం, అసహనానికి గురి కావడం జరుగుతుంది.

పీరియడ్స్ సమయంలో మహిళలు అలసటగా ఉంటారు.. అనారోగ్యానికి గురవుతుంటారు. ఆ సమయంలో వారు రెస్ట్ తీసుకోవాలని చెబుతుంటారు. పూజ చేసే సమయంలో చాలా పవిత్రంగా ఉండాలి. ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకొని పద్దతిగా పూజలు చేస్తారు. పీరియడ్స్ సమయంలో స్త్రీల పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.. రక్త స్రావం కారణంగా వవారు ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా పూజలో కూర్చోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థిత ఏర్పడుతుంది. అందుకే గుడి పవిత్రతను కాపాడటానికి వారిని పూజలకు దూరంగా ఉంచాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయాల్లో కూడా ఎక్కువ సేపు నిలబడి ఉండాల్సి వస్తుంది.. కనుక ఆలయ ప్రవేశం ఉండదు అంటారు. పీరియడ్స్ సమయంలో తులసి చెట్టును ముట్టుకోవద్దు.. నీళ్లు పోయకూడదు అంటారు. మహిళలకు ఇది కొంత అసౌకర్యం అనిపించినా.. పీరియడ్స్ లో ఉన్న సమయంలో పూజలకు, గుడికి దూరంగా ఉండాలని సనాతన ధర్మం చెబుతుంది.

Show comments