iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శత్వంలో రూపొందుతున్న ఆచార్య ముందు చెప్పిన ఫిబ్రవరి 4 కాకుండా విడుదల వాయిదా పడొచ్చని జరుగుతున్న ప్రచారానికి నిన్న స్వయానా నిర్మాతలే బ్రేక్ వేయాల్సి వచ్చింది. పోస్ట్ పోన్ లేదని చెప్పినట్టుగానే డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అసలు ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎలా జరిగిందనే అనుమానం అభిమానుల్లో కలిగింది. దానికి కారణాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నా నిర్మాత నాగ వంశి మాత్రం అదేమీ లేదని జనవరి 12 ఫిక్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ని కలిసిన దానయ్య, యువి అధినేతలు ఆయన ద్వారా పవన్ ని కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారనే వార్త గతంలోనే వచ్చింది. కానీ అవి ఫలించాయా లేదా అనేది బయటికి రాలేదు. మరోవైపు పెండింగ్ ఉన్న చివరి కొన్ని సీన్లను భీమ్లా నాయక్ టీమ్ పూర్తి చేస్తోంది. పవన్ సెలవుల కోసం రష్యాకు వెళ్ళేలోపు నిర్ణయం జరిగిపోవాలి. మరోవైపు థియేటర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు కానీ భీమ్లా నాయక్ కు సరిపడినన్ని స్క్రీన్లు దొరకడం లేదన్నది ట్రేడ్ టాక్. అసలే ఏపి టికెట్ రేట్ల వ్యవహారంతో సతమతమవుతున్న బయ్యర్లకు ఈ పరిణామాలు ఏదీ బయటికి చెప్పుకోలేని అయోమయంలోకి తోసేశాయి.
ఒకవేళ భీమ్లా నాయక్ కనక వెనుకడుగు వేయడానికి సిద్ధమైతే దాన్ని ఫిబ్రవరి 4కి షిఫ్ట్ చేసి ఆల్రెడీ ఆ స్లాట్ ని తీసుకున్న ఆచార్యని ఆ నెల చివరికి కానీ లేదా వేసవికి పంపేలా సెట్ చేస్తారట. ఆచార్యకు కొంత రీ షూట్ అవసరం ఉండటంతో ఇలా రెండు రకాలుగా కలిసి వస్తుందని ప్లాన్ చేసుకున్నారన్న మాట. కానీ ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేననే క్లారిటీ వచ్చేసింది. ఆచార్య ఫిబ్రవరి 4 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ పోస్టర్లను సర్కులేట్ చేస్తున్నారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ భీమ్లా నాయక్ డెసిషన్ ఏమవుతుందో వేచి చూడాలి. ఇప్పటికైతే నో చేంజ్ అనే మాటే వినిపిస్తోంది. అదే కొనసాగితే సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో ఉంటుంది
Also Read : Telugu Bigg Boss 5 Finale : స్టార్ సెలెబ్రిటీలతో కలర్ఫుల్ క్లైమాక్స్