వరుణ్ తేజ్ కు మరో డిజాస్టర్!

Varun Tej Experiments In Movies: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో మరో డిజాస్టర్ నమోదు అయ్యింది. మరోసారి ప్రయోగం చేసి వరుణ్ డీలా పడ్డాడు.

Varun Tej Experiments In Movies: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో మరో డిజాస్టర్ నమోదు అయ్యింది. మరోసారి ప్రయోగం చేసి వరుణ్ డీలా పడ్డాడు.

గత వారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే ఆ సినిమా కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ తెచ్చుకోక పోగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి హీరో వరుణ్ తేజ్ తన ప్రతీ సినిమాతో ఏదో ఒక కొత్త తరహా కాన్సెప్ట్ లని  ప్రేక్షకులను అందించడానికి ప్రయత్నిస్తారు. అయన ఉద్దేశం సరైనదే అయినప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావటం లేదు. ఆయన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. వరుణ్ సినిమాలకు హైప్ లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

వరుణ్ గత కొన్నేళ్ళుగా నటించిన సినిమాలు గద్దలకొండ గణేష్ – ఘని – ఎఫ్ 3 – గాంఢీవధారి అర్జున – ఆపరేషన్ వాలెంటైన్. ఈ ఐదు చిత్రాల్లో మూడు కాస్త కొత్త కాన్సెప్ట్ లతో తెరకెక్కగా ఎఫ్ 3, గద్దలకొండ గణేష్ సినిమాలు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు. చిత్రంగా పైన చెప్పుకున్న రెండు కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన మిగతా మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

వరుణ్ ముందుగా తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకుని తరువాత ప్రయోగం చేస్తే బాగుంటుందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నాయి. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మధ్యలో కొత్త కథలతో సినిమాలు తీస్తే వరుణ్ మార్కెట్ ను త్వరగా సంపాదించుకోవచ్చనే వాదన కూడా సరైనదే కదా. మరి వరుణ్ తేజ్ ఇక ముందైనా తన కెరీర్ ప్లానింగ్ లో జాగ్రత్త పడతారని ఆశిద్దాం. ఇక వరుణ్ తేజ్ తదుపరి సినిమా విషయానికి వస్తే పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే పాన్ ఇండియా సినిమాలో ఈ యువ హీరో నటిస్తున్నారు.

Show comments