ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభ వార్త

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ పండుగ రోజున శుభవార్త అందించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయసును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల 26 డిమాండ్ల తో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, జీతాలు, పదవి విరమణ వయస్సు తదితరాలతో దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేసిన ప్రభుత్వం దిగిరాలేదు. పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. చివరకు ఏ డిమాండ్ లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కూడా సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరుతామని వేసుకున్నాక చివరికి కేసీఆర్ అంగీకరించారు. అప్పటి నుంచి కార్మికుల ఒక్కొక్క డిమాండ్ ను నెరవేరుస్తున్నారు. కార్మిక సంఘాలను అణచివేసేందుకు కేసీఆర్ ఇలా వ్యవహరించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Show comments