IPL 2024 Final: కప్పు ఎవరిదో డిసైడ్‌ చేసేది ఆ ఒక్కటే!

IPL Final, IPL 2024, KKR vs SRH: ఐపీఎల్‌ ఫైనల్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే.. ఐపీఎల్‌ కప్పును ఎవరు ముద్దాడుతారనే విషయాన్ని అదొక్కటే డిసైడ్‌ చేయనుంది. మరి ఆ లక్‌ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

IPL Final, IPL 2024, KKR vs SRH: ఐపీఎల్‌ ఫైనల్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే.. ఐపీఎల్‌ కప్పును ఎవరు ముద్దాడుతారనే విషయాన్ని అదొక్కటే డిసైడ్‌ చేయనుంది. మరి ఆ లక్‌ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తుది పోరు కోసం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఆదివారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో ఈ మెగా మ్యాచ్‌ జరగనుంది. రెండున్నర నెలలుగా క్రికెట్‌ అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్న ఐపీఎల్‌కు.. ఈ మ్యాచ్‌తో ముగింపు పడనుంది. ఈ ఫైనల్‌ పోరు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్‌లో రెండు బెస్ట్‌ టీమ్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో.. సూపర్‌ క్రికెట్‌ చూసేందుకు ఇదే బెస్ట​ అంటున్నారు ఫ్యాన్స్‌. అయితే.. ఈ మ్యాచ్‌లో విన్నర్‌ను డిసైడ్‌ చేసే ఒక లక్‌ ఉంది. అది ఎవర్ని వరిస్తే వారిదే కప్పు అంటున్నారు క్రికెట్‌ నిపుణులు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైనల్‌ మ్యాచ్‌కు టాస్‌ ఎంతో కీలకం కానుందని క్రికెట్‌ పండితులు అంటున్నారు. చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌.. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో స్పిన్నర్లకు టర్న్‌ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే పిచ్‌పై శుక్రవారం క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఆ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ(తేమ) ఉంటుందని, బ్యాటింగ్‌ ఈజీ అవుతుందని అంచనా వేశాడు.

కానీ, రెండు ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ లేకపోవడం, స్పిన్నర్లకు పిచ్‌ను సపోర్ట్‌ లభించడంతో శాంసన్‌ ప్లాన్‌ బెడిసి కొట్టింది. దాంతో రాజస్థాన్‌ ప్రస్థానం క్వాలిఫైయర్‌-2తోనే ముగిసింది. అందుకే.. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా టాస్‌ ఎంతో కీలకం కానుంది. టాస్‌ గెలిచే జట్టు.. తొలుత బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌ స్పిన్‌కు సపోర్ట్‌ లేకపోవడం మంచి స్కోర్‌ చేస్తే.. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ రాకుంటే.. కట్టు దిట్టంగా బౌలింగ్‌ వేసి.. స్కోర్‌ డిపెండ్‌ చేసుకోవాలి రెండు జట్టు.. కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తున్నాయి. అందుకే.. టాస్‌ నెగ్గిన టీమ్‌ కప్పు కొడుతుందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments