వైద్యురాలి నిర్లక్ష్యం?.. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తే..!

వైద్యురాలి నిర్లక్ష్యం?.. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తే..!

ఈ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్రసవం కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక మరసటి రోజు ఈ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని లీలావతితో పాటు ఆమె భర్త కూడా ఎంతో మురిసిపోయాడు. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు.

ఈ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్రసవం కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక మరసటి రోజు ఈ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని లీలావతితో పాటు ఆమె భర్త కూడా ఎంతో మురిసిపోయాడు. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు.

ఈ నెల 22న లీలావతికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే ప్రసవం కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక మరసటి రోజు ఈ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని లీలావతితో పాటు ఆమె భర్త కూడా ఎంతో మురిసిపోయాడు. ఇక కూతురి పుట్టిందని తన తల్లిదండ్రులకు, బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. అదే రోజు ఆస్పత్రిలో లీలావతితో పాటు బిడ్డ కూడా మృతి చెందింది. ఈ వార్త విని లీలావతి భర్త, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు తల్లి, బిడ్డ ఎలా చనిపోయారు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పెరుమోళ్లపల్లిలో చరణ్ రెడ్డి, లీలావతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలానికి లీలావతి గర్భం దాల్చింది. కొన్ని నెలల పాటు భర్త వద్దే ఉన్న ఆ మహిళ.. తొమ్మిదో నెల రాగానే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 22న లీలావతికి పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక మరుసటి రోజు ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని ఆమె భర్త, అత్తమామలు ఎంతో మురిసిపోయారు. మొదటగా కూతురు పుట్టడంతో లాలావతి, చరణ్ దంపతులు చాలా సంతోష పడ్డారు. ఘనంగా పండగ చేయాలని అనుకున్నారు.

కానీ, వీరి సంతోషం ఎక్కువ సేపు నిలువలేక తల్లి, బిడ్డ ఆస్పత్రిలోనే మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్పందించి.. ఆస్పత్రిలోని ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే మా కూతురు చనిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టి అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టిన కొద్దిసేపటికే బిడ్డతో పాటు తల్లి మృతి చెందిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments