ఈ వారం థియేటర్లో, OTTలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

ఈ వారం థియేటర్లో, OTTలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

ప్రస్తుతం కొత్త నెల ప్రారంభం కావడంతో.. సినీ ప్రియులు ఈనెలలో ముఖ్యంగా ఈ వారంలో ఏ కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలోకి విడుదల కానున్నయ్యే అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి అభిరుచుల మేరకు ఈ జూన్ నెలలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి 3 కొత్త సినిమాలు విభన్న కథలతో థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా మరి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.

ప్రస్తుతం కొత్త నెల ప్రారంభం కావడంతో.. సినీ ప్రియులు ఈనెలలో ముఖ్యంగా ఈ వారంలో ఏ కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలోకి విడుదల కానున్నయ్యే అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి అభిరుచుల మేరకు ఈ జూన్ నెలలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి 3 కొత్త సినిమాలు విభన్న కథలతో థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా మరి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.

ప్రస్తుత కాలంలో మూవీస్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కాస్త సమయం దొరికితే చాలు చాలామంది ఏదో ఒక కొత్త సినిమాను చూడాలనే కాన్సెఫ్ట్ తో ఉంటారు. ముఖ్యంగా ఈ విషయంలో మూవీ లవర్స్ గురించే అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వీరు  ప్రతి నెల, ప్రతి వారం ఏ కొత్త సినిమాలు వస్తాయనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక వారి అభిరుచుల మేరకు థియేటర్లలో కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్త తరహా సినిమాలు సందడి చేస్తునే ఉంటాయి. అయితే గడిచిన మే నెలలోని థియేటర్లలో అంతా చిన్న చిన్న చిత్రాలతోనే ఎంటర్టైన్మెంట్ చేశాయి. కానీ, ఇప్పుడు మరొ కొత్త నెల అనగా జూన్ నెల ప్రారంభమైంది. దీంతో ఈనెలలో ముఖ్యంగా.. ఈ వారం థియేటర్లలో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయని మూవీ లవర్స్ ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. వారిని  ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈవారం థియేటర్లలో 3 కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా.. థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలపై ఎంతటి ఆసక్తి నెలకొంటుందో.. అదే విధంగా ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాల కోసం కూడా అడియాన్స్ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు. మరి, ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేసే ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ జూన్ నెలలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సరికొత్త కథలతో 3 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటిలో ఒకటి లవ్ అండ్ ఫ్యామీలి ఎంటర్టైన్మెంట్ మూవీ ఒకటి అయితే, మరొకటి యాక్షన్ మూవీ,ఇంకొటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. పైగా ప్రేక్షకుల అభిరుచుల మేరకు 3 విభిన్న కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసెద్దాం.

మనమే

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో అలరించే హీరో  శర్వానంద్ ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలాకాలం అయ్యింది. అయితే తాజాగా ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమాలో నటించారు. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టి నటించింది. ఇక  ఇందులో మాస్టర్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషించారు. కాగా, ఈ సినిమా ఈనెల 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే మనమే సినిమా కొత్త కథ, ఫ్రెష్ స్క్రిఫ్ట్ అని చెప్పలేము కానీ, ఇదొక మ్యూజికల్ ఫిల్మ్ అని నమ్మకంగా హీరో శర్వానంద్ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అయ్యే కథతో దర్శకుడు రూపొందించరని, పైగా కుటుంబంతో కలిసి ఈ చిత్రానికి వెళ్తే మూడు తరాల వాళ్లు ఈ కథతో కనెక్ట్‌ అవుతారని అంటున్నారు. మరి, మూవీ టీమ్ అంచనాల మేరకు మనమే సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో మూవీ విడుదలయినంత వరకు వేచి ఉండాలి.

వెపన్

నటుడు సత్యరాజ్ వసంత్ రవి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం వెపన్. కాగా, ఈ మూవీని గుహన్‌  సెన్నియ్యప్పన్ తెరకెక్కించారు. ఇక ఇందులో తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కించిన చిత్రమని, దర్శకుడు సరికొత్త విజన్ తో దీన్ని రూపొందించారని చెబుతున్నారు. ముఖ్యంగా డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయని చిత్ర బృందం చెబుతుంది. ఇక ఈ చిత్రం జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

రక్షణ

హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన తాజా క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రక్షణ’. ఇందులో రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా ఈనెల అనగా జూన 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఒక పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు ప్రణదీప్‌ ఠాకూర్‌ రూపొందించారు. ఇకపోతే ఇందులో పాయల్‌ శక్తిమంతమైన పోలీసుగా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుంది’ అని చిత్ర బృందం తెలిపింది. మరి, ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత మేరకు ఆకట్టుకుంటుందో థియేటర్లలో విడుదలయ్యేంత వరకు ఎదురు చూడాలి.

ఇక ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్ ఏవేవి ఉన్నాయో చూసెద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌

షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)- జూన్‌ 03
హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05
హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05
బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06

స్వీట్‌ టూత్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 06
హిట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)- జూన్‌ 07
పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07

అమెజాన్‌ ప్రైమ్‌

మైదాన్‌ (హిందీ)- జూన్‌ 05

డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌

గునాహ్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05
క్లిప్ప్‌డ్‌- (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

సోనీలివ్‌

గుల్లక్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 07
వర్షన్గల్కు శేషం (మలయాళం)- జూన్‌ 07

ఆహా

బూమర్‌ అంకుల్‌ (తమిళ)- జూన్‌07

బుక్‌ మై షో

ఎబిగైల్‌ (హాలీవుడ్)- జూన్‌ 07

జియో సినిమా

బ్లాక్‌ అవుట్‌ (హిందీ)- జూన్‌ 07

Show comments